
ఉత్సాహంగా కబడ్డీ క్రీడాకారుల ఎంపికలు
మహబూబ్‌నగర్ క్రీడలు: యువ తెలంగాణ కబడ్డీ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే జిల్లా క్రీడాకారుల ఎంపికలను శుక్రవారం జిల్లాకేంద్రంలోని స్టేడియంలో నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కబడ్డీ సంఘం ప్రధాన కార్యదర్శి కురుమూర్తిగౌడ్ మాట్లాడుతూ.. ఈనెల 3వ తేదీన హైదరాబాద్‌లోని ఎల్‌బీ స్టేడియంలో యువ తెలంగాణ చాంపియన్‌షిప్ సెలక్షన్స్‌కు సంబంధించి ముందుగా జిల్లాస్థాయిలో ఎంపికలు నిర్వహించడం జరిగిందన్నారు. జిల్లాస్థాయిలో ఎంపికై న క్రీడాకారులు 3న ఉదయం 9గంటలకు ఎల్‌బీ స్టేడియంలో రిపోర్టు చేయాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు దామోదర్‌రెడ్డి, సంయుక్త కార్యదర్శి నర్సింహులు, కార్యనిర్వాహక కార్యదర్శి బాల్‌రాజయ్య, శ్రీనివాసులు, గణేశ్ పాల్గొన్నారు.
ఎంపికై న క్రీడాకారులు
మహేశ్, హేమంత్, మహిపాల్, అరవింద్, పాండు, కౌశిక్, శ్రీకాంత్, హున్యానాయక్, శివ, శ్రీహరి, వినయ్, చందు, సురేశ్, కె.శ్రీకాంత్, రాకేష్‌కుమార్.