
గంగాభవానీ ఆలయంలో చోరీ
చిన్నచింతకుంట: మండల కేంద్రంలోని శ్రీ గంగా భవానీ మాత ఆలయంలో గుర్తు తెలియని వ్యక్తులు చొరబడి అమ్మవారి బంగారు, వెండి ఆభరణాలను దోచుకెళ్లారు. చిన్నచింతకుంట ఎస్‌ఐ రాంలాల్ నాయక్ తెలిపిన వివరాల మేరకు.. గురువారం సాయంత్రం ఆలయం తలుపులకు ఉన్న తాళాలను పగులగొట్టి అమ్మవారి చైను, బంగారు పుస్తెల తాడు, వెండి ముఖం, రెండు చేతులు, ముక్కెర, కిరీటం, వడ్డానాన్ని ఎత్తుకెళ్లారు. ఈ ఆభరణాల విలువ రూ. 2 లక్షలు ఉంటుంది. ఆలయాన్ని శుభ్రపరిచే నిరంటి కల్పన శుక్రవారం ఆలయానికి వెళ్లగా తాళాలు విరగొట్టి ఉండడంతో పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు.