
సద్వినియోగం చేసుకోవాలి..
ప్రభుత్వం నుంచి తీసుకున్న రుణాలను మహిళా సంఘాల సభ్యులు సద్వినియోగం చేసుకోవాలి. ప్రతినెలా జరిగే జెడ్‌ఎంఎస్ సమావేశంలో సభ్యులకు ఈ విషయాన్ని తెలియజేస్తున్నాం. ఈసారి అనుకున్న లక్ష్యం కన్నా అధికంగా రుణాలు ప్రభుత్వం ఇచ్చింది. సక్రమంగా చెల్లిస్తే వడ్డీ లేని రుణం వర్తిస్తుంది. – కె.స్వాతి,
జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు
లక్ష్యం చేరుకుంటాం..
జిల్లాకు ఈ ఆర్థిక సంవత్సరంలో కేటాయించిన రుణ లక్ష్యాన్ని పూర్తి చేస్తాం. మహిళలు ఆర్థిక పరిపుష్టి సాధించేందుకు ప్రభుత్వం రుణాలు ఇచ్చి ప్రోత్సహిస్తుంది. ఇందులో భాగంగా ఏటా రుణ లక్ష్యం పెంచుతోంది. రుణాలను మహిళలు సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా బలోపేతం కావాలి.
– నర్సింహులు, డీఆర్‌డీఓ
●