
మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి ఇందిర పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని ఎంవీఎస్ జూనియర్ కళాశాలలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు అవగాహన కల్పించారు. మాదకద్రవ్యాలను సేవిస్తే అనేక అనార్థాలు ఉన్నాయని, వాటికి అలవాటు పడడంతో శారీరక, మానసిక సమస్యలు తలెత్తుతాయని, ఆడుతూపాడుతూ ఎదగాల్సిన యువత మత్తుపదార్థాలకు అలవాటు పడితే జీవితం అంధకారం అవుతుందన్నారు. అలాగే ర్యాగింగ్ నిషేధచట్టం, చైల్డ్‌లేబర్, లీగల్‌సర్వీస్ యాక్ట్‌పై అవగాహన కల్పించారు. ప్రిన్సిపాల్ భీంరెడ్డి, రవికుమార్, యోగేశ్వర్, అశోక్‌గౌడ్ పాల్గొన్నారు.
జీవన ప్రమాణాలు
మెరుగుపడాలి: వీసీ
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: జీవన ప్రమాణాలు మెరుగుపడాలంటే ఆర్థిక క్రమశిక్షణ అవసరం అని పాలమూరుయూనివర్సిటీ వీసీ శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ మేరకు పీయూలో ఎంబీఏ విభాగం ఆధ్వర్యంలో ఆర్థిక విద్య, జీవన నైపుణ్యాలు అనే అంశంపై ఒకరోజు జాతీయ వెబినార్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆన్‌లైన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. జాతీయ విద్యా విధానం–2020 ప్రకారం నైపుణ్య ఆధారిత పరిజ్ఞానం అవసరం అన్నారు. విద్యార్థి దశలోనే ఆర్థిక అవగాన పెంచుకుని, దేశ స్థూల జాతీయోత్పత్తిలో మీ వంతు పాత్ర పోషించాలన్నారు. కీనోట్ స్పీకర్, సీనియర్ కన్సల్టెంట్ బ్రహ్మ, రిజిస్ట్రార్ రమేష్‌బాబు, మధుసూదన్‌రెడ్డి, అర్జున్‌కుమార్, జావిద్‌ఖాన్, నాగసుధ, అరుంధతిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
మొక్కలను సంరక్షించాలి
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: జిల్లాకేంద్రంలోని బండమీదిపల్లిలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రార గణంలో కొనసాగుతున్న నర్సరీని శుక్రవారం స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ శివేంద్రప్రతాప్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలోని ఆయా నర్సరీలలో వివిధ రకాల మొక్కలను పెంచి సంరక్షించాలని మున్సిపల్ అధికారులకు సూచించారు. వీటి నిర్వహణలో ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. కార్యక్రమంలో డీఈఈ నర్సింహ, ఏఈ రాగవినతి, రిటైర్డ్ ఫారెస్ట్ ఆఫీసర్ హనుమంతు పాల్గొన్నారు.

మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి