
పరిశ్రమలకు గడువులోగా అనుమతులు
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): జిల్లాలోని పరిశ్రమ స్థాపనకు వివిధ శాఖల నుంచి గడువులో గా అనుమతులు మంజూరు చేయాలని కలెక్టర్ విజయేందిర పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక క లెక్టరేట్‌లోని వీసీ హాల్‌లో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ జడ్చర్ల పోలేపల్లి సెజ్, ఇండస్ట్రీయ ల్ ఎస్టేట్ ఓపెన్ డ్రైవ్స్ అత్యవసరంగా చేపట్టి పూర్తి చేయాలన్నారు. కాలుష్యకారక పరిశ్రమలపై ఏర్పాటు చేసిన అధికారుల కమిటీ పరిశ్రమలలో గాలి, నీటి కాలుష్యం, అన్ని రకాల కాలు ష్య కారక పరిశ్రమలను సందర్శించి రిపోర్ట్ సమర్పించాలని, పరిశ్రమలలో ప్రమాదాలు జరగ కుండా నివారించేందుకు తగిన చర్యలు చేపట్టాలన్నారు. పరిశ్రమలకు సంబంధించిన ఇబ్బందు లు ఉంటే పరిష్కరిస్తామని పేర్కొన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ శివేంద్రప్రతాప్, జిల్లా పరిశ్రమ జనరల్ మేనేజర్ ప్రతాప్, కాలుష్య ని యంత్రణ మండలి ఈఈ సురేష్ పాల్గొన్నారు.