రెండు బైకులు ఢీ: వృద్ధుడి దుర్మరణం | - | Sakshi
Sakshi News home page

రెండు బైకులు ఢీ: వృద్ధుడి దుర్మరణం

Aug 1 2025 12:21 PM | Updated on Aug 2 2025 10:22 AM

రెండు

రెండు బైకులు ఢీ: వృద్ధుడి దుర్మరణం

కల్వకుర్తి రూరల్‌: మండలంలోని గుంటూరు గ్రామ సమీపంలో రెండు బైకులు ఢీకొన్న ఘటనలో వృద్ధుడు మృతి చెందాడు. గురువా రం గ్రామానికి చెందిన బూడిద బాలయ్య(65) బైక్‌పై పొలం నుంచి పాలు తీసుకొని గ్రామానికి వస్తున్న నేపథ్యంలో శంకరయ్య అనే వ్యక్తి బైక్‌తో ఢీకొట్టడంతో బాలయ్య కిందపడ్డాడు. తలకు తీవ్రగాయాలు కావడంతో చికిత్స నిమిత్తం కల్వకుర్తి ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌ తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీ సులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్‌ఐ హనుమంతరెడ్డి తెలిపారు.

విద్యుదాఘాతంతోవ్యక్తి మృతి

ధన్వాడ: విద్యుత్‌ ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన ఘటన బుధవారం ధన్వా డ మండలంలోని గున్మక్ల గ్రామంలో చోటు చేసుకుంది. బాధిత కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన చెన్నయ్యగౌడ్‌(56) వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. బుధవారం రాత్రి ఇంటిపై ఉన్న వాటర్‌ ట్యాంక్‌లో నీరు నింపేందుకు మోటార్‌ ఆన్‌ చేసేందుకు ప్లగ్‌ను స్విచ్‌ బోర్డులో పెడుతుండగా ప్రమాదవశాస్తు విద్యు త్‌ షాక్‌ కొట్టి పడిపోవడంతో కుటుంబ సభ్యు లు మరికల్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే ఆయన మృతి చెందినట్లు డాక్టర్లు ధృవీకరించడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుడి భార్య సినామ్మ ఫిర్యాదు మేరకు ధన్వాడ పోలీసులు కేసు నమోదు చేశారు.

చికిత్స పొందుతూవ్యక్తి మృతి

మానవపాడు: ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి తీసుకెళ్లిన యువకుడి తండ్రితో ఆమె బంధువులు ఫోన్‌లో అన్న మాటలకు మనస్తాపం చెంది పురుగుల మందు తాగాడు. చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటన గురువారం మండలంలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ చంద్రకాంత్‌ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని జల్లాపురం గ్రామానికి చెందిన బతికిన హేమలమ్మ, జమ్మన్నల కుమారుడు బతికిన వీరేంద్ర రేవతిని ప్రేమించాడు. పెళ్లి చేసుకోవడానికి ఆమెను తీసుకెళ్లాడు. దీంతో అ మ్మాయి బంధువులు జల్లాపురం దావీదు, కర్నూల్‌కు చెందిన సుధాకర్‌, రాము, బీచుపల్లి, రాముడు కలిసి వీరేంద్ర తండ్రి జమ్మన్నకు ఫోన్‌ చేసి కొడుకు తీసుకెళ్లిన అమ్మాయిని తీసుకరావాలని హెచ్చరించారు. వాళ్ల మాటలకు జమ్మన్న(45) మనస్తాపానికి గురై మంగళవారం పురుగు మందు తాగాడు. వెంటనే చికిత్స నిమి త్తం కర్నూల్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఆయన భార్య హేమలమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమో దు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

నీళ్లు తెచ్చేందుకు వెళ్లి శవమై తేలాడు

పెద్దకొత్తపల్లి: బావిలో నీళ్లు తెచ్చేందుకు వెళ్లి యువకుడు శవమై తేలిన ఘటన మండలంలోని పెద్దకారుపాములలో జరిగింది. గ్రామానికి చెందిన ఎండీ ఆసిఫ్‌(22) అనే యువకుడు పొలం పనులకు వెళ్లి బావి వద్దకు నీళ్లు తెచ్చేందుకు వెళ్లి మూర్ఛ రావడంతో బావిలో పడి మృతి చెందిన సంఘటన గురువారం చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన బిక్కు, హాజీయాబేగం దంపతుల కుమారుడు ఆసీఫ్‌ కూలీగా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో గ్రామానికి చెందిన గోవింద్‌ అనే రైతు వ్యవసాయ పొలంలో గుంటక తోలడానికి వెళ్లాడు. మధ్యాహ్న భోజన సమయంలో నీళ్లు తెచ్చేందుకు వ్యవసాయ బావి వద్దకు వెళ్లగా మూర్ఛ రావడంతో బావిలో పడి మృతి చెందాడు. యువకుడి మృతి విషయమై ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఎస్‌ఐ సతీష్‌ తెలిపారు.

కొత్త వ్యక్తులతోజాగ్రత్తగా ఉండాలి

మహబూబ్‌నగర్‌ క్రైం: నగరాల్లో ఇతర ప్రాంతాల నుంచి అద్దెకు నివాసం ఉండటానికి కొత్త వారు ఎంతో మంది వస్తుంటారని, అలాంటి వాళ్లకు ఇళ్లను అద్దెకు ఇచ్చే క్రమంలో జాగ్రత్తలు తీసుకోవాలని డీఎస్పీ వెంకటేశ్వర్లు అన్నారు. మహబూబ్‌నగర్‌ వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఉన్న బండ్లగేరి ఏరియాలో గురువారం కార్డెన్‌ అండ్‌ సెర్చ్‌ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా పోలీసులు మొత్తం 210 ఇళ్లు తనిఖీ చేసి ఆయా ఇళ్లలో నివాసం ఉండే వారి ఐడెంటీ పత్రాలు పరిశీలించారు. ఈ క్రమంలో 15 ద్విచక్ర వాహనాలు, మూడు ఆటోలను ఎలాంటి పత్రాలు లేకుండా అనుమానాస్పదంగా ఉన్నట్లు గుర్తించారు. అనంతరం డీఎస్పీ మాట్లాడుతూ ప్రజల భద్రత కోసం పోలీస్‌ అన్ని రకాల చర్యలు చేపడుతుందని తెలిపారు. పోలీసులు పలు రకాల అక్రమ కార్యకలాపాలను అరికట్టడానికి ప్రజల సహకారం ఎంతో అవసరమన్నారు. కార్యక్రమంలో వన్‌టౌన్‌ సీఐ అప్పయ్య, ఎస్‌ఐ శీనయ్య ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

రెండు బైకులు ఢీ:  వృద్ధుడి దుర్మరణం
1
1/2

రెండు బైకులు ఢీ: వృద్ధుడి దుర్మరణం

రెండు బైకులు ఢీ:  వృద్ధుడి దుర్మరణం
2
2/2

రెండు బైకులు ఢీ: వృద్ధుడి దుర్మరణం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement