
అంతా మా ఇష్టం!
రాజాపూర్: పరిశ్రమల నుంచి కాలుష్యాన్ని బయటకు వదలకూడదని ఇటు అన్ని శాఖలతో పాటు కాలుష్య నియంత్ర బోర్డు అధికారులు యా జమాన్యాలను హెచ్చరిస్తున్నా.. పోలేపల్లి సెజ్‌లోని పా ర్మా పరిశ్రమల తీరు మారడంలేదు. అధికారుల వచ్చి హడావుడి చేసినా యాజమాన్యాలు పరిశ్రమల నుంచి కాలుష్య జలాలను రైతుల పొలాల్లోకి యథేచ్ఛగా వదులుతున్నారు. ఇప్పటికే పోలేపల్లి సెజ్ చుట్టూ పొలాలున్న రైతులు గతకొన్ని సంవత్సరాలుగా పరిశ్రమలు వదులుతున్న జల, వాయు కాలుష్యాల మూలంగా పంటలు పండక, జన జీవరాసులు సైతం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయాలపై ముదిరెడ్డిపల్లి, రాయపల్లి, పోలేపల్లి రైతులు సంబంధిత అధికారులకు ఎన్నో పర్యాయయాలు ఫిర్యాదులు చేస్తూనే ఉన్నారు. అయితే అధికారులు వచ్చినప్పుడు పరిశ్రమల్లో నుంచి బయటికి కాలుష్యం వదలకుండా జాగ్రతలు తీసుకుంటారు. మరుసటి రోజే కాలుష్యాన్ని బయటికి వదలడం పరిపాటిగా మారింది. ఇటీవల ప్రజావాణిలో కలెక్టర్‌కు సమీప గ్రామాల రైతులు ఫిర్యాదు చేశాయగా.. కలెక్టర్ సంబంధిత అన్ని శాఖలను కలిపి కమిటీ వేశారు. దీంతో మంగళవారం అధికారుల బృందం సెజ్‌లోని పరిశ్రమలు, రైతుల పొలాలను పరిశీలించి నీటి శ్యాంపిల్లను తీసుకువెళ్లారు. అధికారులు వచ్చి 24గంటలు కాకముందే సెజ్‌లోని పరిశ్రమల నుంచి జల, వాయుకాలుష్యాన్ని వదులుతున్నారు. ఇటీవల పూర్తి అనుమతులు కూడా రాని ఓ ఫార్మా కంపెనీ ట్రయల్‌రన్ ను ంచే కాలుష్యపు నీటిని బయటికి వదులుతున్నారు.
జువైనెల్ కోర్టుకు లైంగిక దాడి నిందితులు
జడ్చర్ల: ఏడేళ్ల చిన్నారిపై సామూహిక లైంగిక దాడికి పాల్పడిన ఐదుగురు మైనర్ బాలురను గురువారం అరెస్ట్ చేసి మహబూబ్‌నగర్ జువైనెల్ కోర్టులో హాజరు పరచినట్లు స్థానిక సీఐ కమలాకర్ తెలిపారు. లైంగిక దాడికి గురైన బాలికకు వైద్య చికిత్సల అనంతరం తల్లిదండ్రులకు అప్పగించినట్లు పేర్కొన్నారు. తమ అమ్మానాన్నలను చూసే ఇటువంటి అఘాయిత్యానికి పాల్పడ్డామని ఓ నిందితుడు పోలీసుల విచారణలో చెప్పడం గమనార్హం.
అధికారులు వచ్చినప్పుడు హడావుడి
యథేచ్ఛగా రైతుల పొలాల్లోకి కాలుష్య జలాలు
పోలేపల్లి సెజ్‌లో మారని పార్మా పరిశ్రమల తీరు

అంతా మా ఇష్టం!