
డ్యాం గేట్ల రోప్‌ల పరిశీలన
రాజోళి: సుంకేసుల డ్యాం గేట్లకు ఉన్న రోప్‌ను పరిశీలించి ముందస్తుగా చర్యలు చేపట్టారు. వరద ఉధృతి ఎక్కువగా వస్తుండటంతో డ్యాం గేట్లను అప్పటికే పరిశీలించిన అధికారులు, అనుసంధానంగా ఉన్న రోపులను పరిశీలించారు. గత రెండు రోజులుగా లక్ష క్యూసెక్కులకు పైగా వచ్చిన వరద కారణంగా రోపులు దెబ్బతిన్నాయా అన్న కోణంలో చర్యలు చేపట్టారు. గురువారం ఎగువ నుంచి వస్తున్న వరద కొంత తగ్గుముఖం పట్టడంతో అవసరమైన చోట పనులు చేపట్టారు. నదికి వస్తున్న వరద కారణంగా రోపులను పరిశీలించి ముందస్తు మరమ్మతులు చేపడుతున్నట్లు జేఈ మహేంద్ర పేర్కొన్నారు.