ఫార్మసీ, ఐసీ, బీఎడ్‌, ఎంఎడ్‌ ఫలితాలు విడుదల | - | Sakshi
Sakshi News home page

ఫార్మసీ, ఐసీ, బీఎడ్‌, ఎంఎడ్‌ ఫలితాలు విడుదల

Jul 31 2025 7:12 AM | Updated on Jul 31 2025 8:58 AM

ఫార్మ

ఫార్మసీ, ఐసీ, బీఎడ్‌, ఎంఎడ్‌ ఫలితాలు విడుదల

మహబూబ్‌నగర్‌ ఎడ్యుకేషన్‌: పీయూ పరిధిలోని ఫార్మసీ, ఇంటిగ్రేటెడ్‌ కెమిస్ట్రీ, బీఎడ్‌, ఎంఎడ్‌ పరీక్ష ఫలితాలను వీసీ శ్రీనివాస్‌ బుధవారం విడుదల చేశారు. ఈ మేరకు ఫార్మసీలో 6వ సెమిస్టర్‌లో 100శాతం ఉత్తీర్ణత, ఇంటిగ్రేటెడ్‌ కెమిస్ట్రీలో 100శాతం, బీఎడ్‌ సెమిస్టర్‌ 2లో 30.28శాతం, బీఎడ్‌ సెమిస్టర్‌ 6లో 65.91శాతం, ఏంఎడ్‌ సెమిస్టర్‌ 1లో 73.33, సెమిస్టర్‌లో 3లో 52.58శాతం ఉత్తీర్ణత సాధించారు. ఫలితాలను పీయూ వెబ్‌సైట్‌లో చూసుకోవాలని, అభ్యంతరాలు ఉంటే రీవాల్యువేషన్‌ కోసం దరఖాస్తులు చేసుకోవాలని కంట్రోలర్‌ ప్రవీణ ఒక ప్రకటనలో తెలిపారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ రవికాంత్‌, కరుణాకర్‌రెడ్డి, సురేష్‌, ఈశ్వర్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

ఇంజినీరింగ్‌ కోర్సులో

అడ్మిషన్లు

మహబూబ్‌నగర్‌ ఎడ్యుకేషన్‌: పీయూలో నూతనంగా ప్రారంభించిన ఇంజనీరింగ్‌ కోర్సుల్లో విద్యార్థులు అడ్మిషన్లు పొండుతున్నారు. టీఎస్‌ఎఫ్‌సెట్‌ ఎంట్రెన్స్‌ ద్వారా అడ్మిషన్లు పొందిన విద్యార్థులు ఈ నెల 28 వరకు ఆన్‌లైన్‌ రిపోర్టింగ్‌ చేయాల్సి ఉండగా.. ఆగస్టు 2 వరకు సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ చేయా ల్సి ఉంది. ఈ క్రమంలో మొదటి అడ్మిషన్‌ను గద్వా ల్‌ జిల్లాకు చెందిన టీనాకుమారి తీసుకోగా.. అక్నాలెడ్జ్‌మెంట్‌ను ప్రిన్సిపాల్‌ చంద్రకిరణ్‌ అందించారు.

ప్రేమ పెళ్లి వద్దన్నారని.. బాలిక ఆత్మహత్య

మానవపాడు: తాను ప్రేమించిన వ్యక్తితో పెళ్లి చేయడం లేదని ఓ బాలిక ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన మానవపాడు మండలం గోకులపాడులో చోటు చేసుకుంది. ఎస్‌ఐ చంద్రకాంత్‌ వివరాల మేరకు.. ఏపీలోని కర్నూలు జిల్లా రేమట గ్రామానికి చెందిన ఎర్రల గిరిబాబు కూతురు ఏడో తరగతి వరకు మాత్రమే చదివి ఇంట్లోనే ఉండేది. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన వ్యక్తితో ప్రేమలో పడింది. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు మందలించారు. ఇంకా పెళ్లి వయసు రాలేదని.. ఇలాంటి వ్యవహారాలు చేయరాదని సూచించారు. అయినప్పటికీ మాట వినకపోవడంతో ఇటీవల మానవపాడు మండలం గోకులపాడు గ్రామంలో నివాసముండే బాలిక సోదరి ఇంటికి పంపించారు. దీంతో మనస్తాపానికి గురైన బాలిక.. ఈ నెల 28న పురుగు మందు తాగింది. గమనించిన కుటుంబ సభ్యులు కర్నూలు ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ బుధవారం మృతిచెందింది. తండ్రి ఎర్రల గిరిబాబు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

రోడ్డు ప్రమాదంలో

ఇద్దరికి గాయాలు

చారకొండ: మండలంలోని జూపల్లి సమీపాన జడ్చర్ల–కోదాడ జాతీయ రహదారిపై బుధవారం ద్విచక్రవాహనం అదుపుతప్పి ఇద్దరి యువకులకు గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం కల్వకుర్తి నుంచి దేవరకొండ వైపు శంకర్‌, నరేష్‌లు ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తుండగా ప్రధాన రహదారి మూలమలుపు వద్ద వాహనం అదుపుతప్పి కింద పడింది. ప్రమాదంంలో ఇద్దరు గాయపడటంతో 108 వాహనంలో కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని చారకొండ ఎస్‌ఐ శంషోద్దిన్‌ తెలిపారు.

ఫార్మసీ, ఐసీ, బీఎడ్‌, ఎంఎడ్‌ ఫలితాలు విడుదల  
1
1/1

ఫార్మసీ, ఐసీ, బీఎడ్‌, ఎంఎడ్‌ ఫలితాలు విడుదల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement