
మహబూబ్‌నగర్ 300 ఆలౌట్
మహబూబ్‌నగర్ క్రీడలు: హైదరాబాద్‌లో మంగళవారం జరిగిన బి–డివిజన్ టుడే లీగ్ చాంపియన్‌షిప్‌లో మహబూబ్‌నగర్ జిల్లా జట్టు మెరుగైన స్థితిలో ఉంది. వెస్ట్‌మారేడ్‌పల్లి జట్టుతో జరిగిన మ్యాచ్‌లో మహబూబ్‌నగర్ టాస్ గెలిచి మొదటి బ్యాటింగ్ చేసి 85.1 ఓవర్లలో 300 పరుగులకు ఆలౌట్ అయింది. జట్టులో ఓపెనర్ అబ్దుల్ రాఫే (194 బంతుల్లో 10 ఫోర్లతో 111 పరుగులు) అద్భుతమైన సెంచరీతో రాణించాడు. జట్టులో బి.సంజయ్ (53), కేతన్‌కుమార్ (43), కొండ శ్రీకాంత్ (30) సత్తా చాటారు. ప్రత్యర్థి బౌలర్లలో తరుణ్‌చంద్ర 3, సజ్జా సాయి ప్రణవ్, సిద్దార్థ రెండేసి వికెట్లు తీసుకున్నారు. బుధవారం వెస్ట్‌మారేడ్‌పల్లి జట్టు బ్యాటింగ్ చేపట్టనుంది.
సెంచరీతో రాణించిన అబ్దుల్ రాఫే