
భారీ పాము పట్టివేత
కొత్తకోట రూరల్: మండలంలోని కానాయిపల్లిలో అలంపూర్ మాజీ ఎమ్మెల్యే రావుల రవీంద్రనాథ్‌రెడ్డి ఇంటి ఆవరణలో భారీ పామును స్నేక్‌క్యాచర్, హోంగార్డ్ కృష్ణసాగర్ పట్టుకున్నారు. కారు పార్కింగ్ స్థలంలో ఉన్న పామును ఇంట్లో పనిచేసే వారు గుర్తించి భయాందోళనకు గురై కొత్తకోటలో విధులు నిర్వర్తిస్తున్న కృష్ణసాగర్‌కు ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. ఆయన వెంటనే గ్రామానికి చేరుకుని పామును పట్టుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పట్టుకున్న పాము జెర్రిపోతు అని.. ఏడు ఫీట్ల పొడవు, 12 ఏళ్ల వయస్సు, నాలుగు కిలోల బరువు ఉంటుందన్నారు. పాములు కనబడితే తనకు సమాచారం ఇస్తే పట్టుకొని అడవిలో వదిలేస్తానన్నారు.
శిశుగృహలో బాలుడి అప్పగింత
మహబూబ్‌నగర్ క్రైం: మూడేళ్ల బాలుడిని గుర్తు తెలియని వ్యక్తులు వదిలేసి వెళ్లిన మంగళవారం చోటుచేసుకుంది. టూటౌన్ ఎస్‌ఐ విజయ్‌భాస్కర్ కథనం ప్రకారం.. జిల్లా కేంద్రంలోని సుభాష్‌నగర్‌లోని ఓ మజీద్ వద్ద గుర్తు తెలియని మూడేళ్ల బాలుడిని ఎవరో వదిలేసి వెళ్లినట్లు మంగళవారం డయల్ 100కు కాల్ వచ్చింది. దీంతో పోలీసులు అక్కడికి వెళ్లి బాలుడిని రక్షించారు. ఎవరైనా యాచకులు వదిలేసి వెళ్లారా? లేక ఇంకా ఎవరైనా వదిలేసి వెళ్లారా అనే అంశంపై విచారణ చేస్తున్నామని తెలిపారు. బాలుడి శరీరంపై గాయాలు ఉన్నాయని, శిశుగృహాలో అప్పగించినట్లు ఎస్‌ఐ వెల్లడించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

భారీ పాము పట్టివేత

భారీ పాము పట్టివేత