
గుండాల కోనేటికి జలకళ
కోనేరులోకి చేరిన నీరు
వెల్దండ: దక్షిణకాశీగా ప్రసిద్ధిగాంచిన మండలంలోని గుండాలలో ఉన్న అంబా రామలింగేశ్వరస్వామి ఆలయ కోనేరు జలకళను సంతరించుకుంటుండటంతో భక్తులు భారీగా తరలివచ్చి దర్శించుకుంటున్నారు. ఫిబ్రవరి 26న మహాశివరాత్రి సందర్భంగా కల్వకుర్తి జేపీనగర్‌లో చదివే ఓ విద్యార్థి ప్రమాదవశాత్తు కోనేరులో మునిగి మృతిచెందాడు. ఆ సమయంలో ఎన్డీఆర్‌ఎఫ్ బృందం మోటారు సాయంతో మూడు రోజుల పాటు కోనేటిలోని నీటిని బయటకు తోడి మృతదేహాన్ని బయటకు తీశారు. వందల ఏళ్ల చరిత్ర ఉన్న కోనేరు సుమారు 160 గడుల లోతు ఉన్నట్లు వారు పేర్కొన్నారు. అప్పటి నుంచి కోనేరు ఖాళీగా ఉండటంతో ద్వారాలు మూసివేశారు. వర్షాకాలం కావడంతో నీరు కొద్దికొద్దిగా ఉబికి వస్తుండటంతో భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. శ్రావణ మాసం కావడంతో కోనేటిలో స్నానాలకు అనుమతించాలని భక్తులు దేవాదాయశాఖ అధికారులను కోరుతున్నారు. వివాహం, సంతానం లేని వారు ఇక్కటి కోనేటిలో స్నానం చేసి శివలింగానికి అభిషేకం చేస్తే ఫలితం ఉంటుందని భక్తుల నమ్మకం.

గుండాల కోనేటికి జలకళ