
సీడ్‌పత్తి రైతులకు బకాయిలు చెల్లించండి
గద్వాల: జిల్లాలో విక్రయించిన సీడ్‌పత్తికి సంబంధించి పెండింగ్‌లో ఉన్న డబ్బులను వెంటనే సంబంధిత రైతులకు చెల్లించాలని సీడ్ కంపెనీలను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు ఆదేశించారు. బాధిత రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను మంత్రి జూపల్లి, ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి సోమవారం మంత్రి తుమ్మల దృష్టికి తీసుకెళ్లారు. జిల్లాలో సుమారు 50వేల ఎకరాల్లో సీడ్‌పత్తిని సాగుచేస్తున్నారని, అయితే గతేడాది ఖరీఫ్‌కు సంబంధించి పండించిన పంట డబ్బులను సీడ్‌కంపెనీలు చెల్లించకుండా రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు తుమ్మలకు వివరించారు. అన్ని కంపెనీలు కలిపి సుమారు రూ.700కోట్లు రైతులకు బకాయిలు ఉన్నట్లు తెలిపారు. దీనిపై స్పందించిన మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు సీడ్‌కంపెనీల ప్రతినిధులతో మాట్లాడి రైతులకు చెల్లించాల్సిన బకాయిలను వెంటనే చెల్లించాలన్నారు. తమది రైతు సంక్షేమ ప్రభుత్వమని రైతులకు ఇబ్బందులకు గురిచేస్తే సహించేది లేదని హెచ్చరించారు.