
హాస్టల్ విద్యార్థినికి అస్వస్థత
నవాబుపేట: మండలంలోని యన్మన్‌గండ్ల బాలికల హాస్టల్ విద్యార్థిని అస్వస్థతకు గురికావడంతో సిబ్బంది మండల కేంద్రంలోని ఆస్పత్రికి తరలించారు. వివరాలు.. సోమవారం మధ్యాహ్నం యన్మన్‌గండ్ల బాలికల హాస్టల్‌కు చెందిన 7వ తరగతి విద్యార్థిని సాత్విక శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతుండడంతో ఉపాధ్యాయులు బాలికలను మండల కేంద్రంలోని పీహెచ్‌సీకి తరలించారు. అక్కడే బాలికకు ప్రథమ చికిత్స అందించి, మెరుగైన వైద్యం కోసం 108 వాహనంలో జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లారు. కాగా అక్కడ బాలిక కోలుకుంటున్నట్లు వైద్యులు తెలిపారు. ఇంత జరిగినా హాస్టల్ వార్డెన్‌కు సహచారం లేకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కోయిలకొండ మండలంలోని దమ్మయ్యపల్లి సాత్విక సొంత గ్రామం కాగా యన్మన్‌గుండ్ల హాస్టర్‌లో ఉంటూ చదువుతుంది. కొన్ని రోజులుగా వర్షాలు కురుస్తుండడంతో వాతావరణంలో వచ్చిన మార్పుల కారణంగా సీజనల్ వ్యాధులు వచ్చే ప్రమాదం అధికంగా ఉంటుంది. ఈ విషయంలో సంబంధిత అధికారులు నిర్లక్ష్యం చే యకుండా విద్యార్థుల ఆరోగ్యంపై నిరంతరం పర్యవేక్షణ ఉంచాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.