
సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకం : వీసీ
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకం అని పీయూ వీసీ శ్రీనివాస్ అన్నారు. పీయూలో సోమవారం కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో గ్లోబల్ సెంటర్ ఫర్‌ది డెవలప్‌మెంట్ సహకారంతో నిర్వహించిన 7 రోజుల ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఉపాధ్యాయుడు విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు సమాజంలో జరుగుతున్న ప్రతి అంశాన్ని తెలుసుకునేందుకు నిత్య విద్యార్థిగా మారాల్సిన అవసరం ఉందన్నారు. పాఠశాల స్థాయిలో విద్యార్థులకు నైతిక విలువలు నేర్పించాలని, తోటి వ్యక్తులతో సమాజంలో ఎలా నడుచుకోవాలో నేర్పించాలని, భావోద్వేగాల నియంత్రణ వంటి అంశాలపై అవగాహన కల్పించాలన్నారు. అప్పుడు ఒక విద్యార్థి సంపూర్ణంగా, సమగ్రంగా అభివృద్ధి చెందడం సాధ్యమవుతుందన్నారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ రమేష్‌బాబు, రీసోర్సుపర్సన్ షాలిని, కన్వీనర్ కరుణాకర్‌రెడ్డి, కోకన్వీనర్ బషీర్ అహ్మద్, జయనాయక్, విజయలక్ష్మి, ఆంజనేయులు, విశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు.