
ఉత్సాహంగా ఎంపికలు
మహబూబ్‌నగర్ క్రీడలు: వరంగల్‌లో వచ్చేనెల 3, 4 తేదీల్లో జరిగే రాష్ట్రస్థాయి అంతర్‌జిల్లా అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొనే జిల్లా క్రీడాకారుల ఎంపికలను ఆదివారం జిల్లా కేంద్రంలోని మెయిన్ స్టేడియంలో నిర్వహించారు. అండర్–14, అండర్–16, అండర్–18, అండర్–20 విభాగాల బాలబాలికలు, పురుషుల, మహిళా విభాగాల ఎంపికలు నిర్వహిచారు. ఈ సందర్భంగా జిల్లా అథ్లెటిక్స్ సంఘం ఉపాధ్యక్షులు పుట్టి సురేష్‌చందర్, ప్రధాన కార్యదర్శి జి.శరత్‌చంద్ర క్రీడాకారులను పరిచయం చేసుకొని మాట్లాడుతూ జిల్లా అథ్లెట్లు రాష్ట్రస్థాయి పోటీల్లో పతకాలు సాధించి జిల్లాకు పేరు ప్రతిష్టలు తీసుకురావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో పీడీలు రమేష్‌బాబు, సి.శ్రీనివాసులు, ఽపి.శ్రీనివాసులు, కోచ్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
షార్ట్‌సర్క్యూట్‌తో
కిరాణ షాపు దగ్ధం
పాన్‌గల్: మండలంలోని మాందాపూర్‌లో షార్ట్‌సర్య్కూట్‌తో కిరాణం షాపు దగ్ధమైన ఘటన శనివారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీనివాసులుకు చెందిన కిరా ణం దుకాణంలో విద్యుత్ షార్ట్‌సర్క్యూట్‌తో కిరా ణం సామగ్రి, ఫ్రిజ్, టీవీ, ఇతర వస్తువులు దగ్ధమై న బాధితుడు పేర్కొన్నారు. ఘటనలో దాదాపుగా రూ.60 వేల వరకు నష్టం వాటిల్లినట్లు తెలిపారు. గతంలో కూడా గ్రామంలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. విద్యుత్ అధికారులు స్పందించి ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.