
‘బీసీలను అవమానిస్తే మూల్యం తప్పదు’
మెట్టుగడ్డ: మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్‌లో జరిగిన బీజేపీ కార్యకర్తల సమావేశంలో బీసీ నాయకుడిని అవమానించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గోనెల శ్రీనివాసులు మండిపడ్డారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని బీసీ సంఘం కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. బీసీ నాయకుడికి జరిగిన అవమానాన్ని యావత్ బీసీ సమాజానికి జరిగిన అవమానంగా భావిస్తున్నామని, తక్షణమే ఎంపీ డీకే అరుణ బీసీ నాయకుడికి, బీసీ సమాజానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీసీ ఓట్లతో గెలిచి, నేడు అదే సమాజానికి చెందిన వారిని అవమానిస్తూ చిన్నచూపు చూడటం తగదన్నారు. బీసీలకు క్షమాపన చెప్పకపోతే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి సరైన పద్ధతిలో బుద్ధి చెప్తామన్నారు.