
నిత్యం.. కలకలం
మహబూబ్‌నగర్
జనావాసాల్లోకి చిరుతలు
సోమవారం శ్రీ 28 శ్రీ జూలై శ్రీ 2025
వివరాలు 8లో u
●
అన్ని చోట్ల కెమెరాలతోపాటు
బోన్లు ఏర్పాటు చేశాం..
జూన్ నుంచి ఆగస్టు వరకు చిరుతల సంపర్కానికి అనుకూల సమయం. ప్రస్తుతం అవి జనావాసాల్లోకి రావడానికి కారణాలు అంతుచిక్కడం లేదు. ఆహారం, నీరు సమృద్ధిగా దొరకనప్పుడే అవి నివాసిత ప్రాంతాలకు వస్తాయి. చిరుతలు అనుకోని సందర్భాల్లో తప్ప మనుషులపై దాడి చేసిన ఘటనలు చాలా తక్కువ. గుట్టల సమీప ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. పిల్లలను ఒంటరిగా వదిలేయొద్దు. ఎక్కడికి వెళ్లినా గుంపులుగానే పోవాలి. వాటిని బంధించేందుకు అన్ని చోట్ల బోన్లు ఏర్పాటు చేశాం. కెమెరాలతో నిత్యం పర్యవేక్షిస్తున్నాం. టీడీగుట్ట వద్ద ఇటీవల వరకు కనిపించిన చిరుత నాలుగైదు రోజులుగా కనిపించడం లేదు.
– సత్యనారాయణ, డీఎఫ్‌ఓ, మహబూబ్‌నగర్
చిరుత జాడ లేకుండా ఏ ఒక్క నెల లేదు..
చిరుతల సంచారంతో వణికిపోతున్నాం. వ్యవసాయ పనులకు వెళ్లాలంటే భయమైతాంది. సాయంత్రం అయ్యిందంటే చాలు.. ఊరంతా తలుపులేసుకుని ఇంట్లోనే ఉంటున్నారు. చిరుత జాడ లేకుండా కనీసం ఏ ఒక్క నెల లేదు. గత నెలలో మా గ్రామంలోని ఓ రైతుకు చెందిన పశువుల పాకలో కట్టేసిన లేగదూడను చిరుత ఎత్తుకుని వెళ్లి అడవికి సమీపంలో రక్తం తాగి పడేసింది. దీంతో కంటి మీద కునుకు లేకుండా పోయింది.
– రవి, మొగుళ్లపల్లి, నవాబుపేట
ఇటీవల వీరన్నపేట, మొన్న టీడీగుట్ట, చౌదర్‌పల్లి, నిన్న మొగుళ్లపల్లి.. ఇలా జిల్లాలో నిత్యం ఏదో ఒక్క చోట చిరుతలు దర్శనమిస్తూనే ఉన్నాయి. ఎక్కడో అటవీ ప్రాంతంలో అవి కనపడుతున్నాయని అనుకుంటే పరవాలేదు. కానీ జనావాసాల పరిధిలోనే దర్శనమిస్తుండడంతో ప్రజలు హడలెత్తుతున్నారు. సుమారు నెల రోజులుగా ఆయా ప్రాంతాల వారికి కంటి మీద కునుకు లేకుండా పోయింది. అయితే చిరుత పులులు కనపడడం.. తదితర చోట్ల గొర్లు, మేకలు, పశువులపై దాడి చేసిన ఘటనలే ఇప్పటివరకు ఉన్నాయి. తాజాగా కోయిల్‌కొండ మండలం కొత్లాబాద్, హన్వాడ మండలం రామన్నపల్లి శివారులో ముగ్గురిపై చిరుత దాడి చేసిన నేపథ్యంలో ప్రజల్లో మరింతగా భయాందోళనలు నెలకొన్నాయి.
● పట్టణ, మండల శివార్లలోని గుట్టల్లో ఆవాసం
● రోజుకో చోట దర్శనం.. గొర్రెలు, మేకలు, పశువులపై దాడి
● ఒక్క మహబూబ్‌నగర్ జిల్లాలో 15 నుంచి 18 వరకు చిరుతలు
● ఫలితం లేని అధికారుల ఆపరేషన్.. భయంభయంగా ప్రజల జీవనం
● కొత్లాబాద్‌లో ముగ్గురిపై దాడితో స్థానికుల్లో ఆందోళన
– సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్

నిత్యం.. కలకలం

నిత్యం.. కలకలం

నిత్యం.. కలకలం

నిత్యం.. కలకలం