
ఎరువుల కోసం వెతలు
పెరిగిన ధరలు.. వేధిస్తున్న కొరత
●
కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు
ఫర్టిలైజర్ దుకాణాల్లో డీలర్లు డీఏపీని కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే ఎక్కువగా అమ్ముతున్నారు. యూరియా రూ.265, డీఏపీ రూ.1,350 ఉంటే అదనంగా డబ్బులు వసూలు చేస్తున్నారు. సొసైటీల్లో ఇచ్చే యూరియా బస్తాలు సరిపోవడం లేదు. బయట కొందామంటే ఇష్టం వచ్చినట్లు ధరకు అమ్ముతున్నారు. అధికారులు రావడం.. పోవడం తప్ప చర్యలు తీసుకోవడం లేదు.
– చంద్రయ్య, రైతు, ఫర్దీపూర్ గ్రామం,
చిన్నచింతకుంట మండలం
యూరియా దొరక్కట్లేదు
మా గ్రామంలో సొంతంగా ఎకరం పొలం ఉండగా, మరో ఐదు ఎకరాలు కౌలుకు తీసుకున్నా. అందులో మూడెకరాల్లో వరి, మరో మూడెకరాల్లో పత్తి వేశా. యూరియా కోసం బిజినేపల్లికి వెళ్లి ప్రైవేటు డీలర్లను అడిగితే స్టాక్ లేదన్నారు. నాటేసినంక 15 రోజులలోపే పొలానికి యూరియా వేస్తేనే పంట దిగుబడి మంచిగా వస్తుంది. వేసిన పంటలకు అధికారులు సరిపడా ఎరువులు ఎందుకు ఇవ్వడం లేదు.
– వెంకటయ్య, రైతు,
ఎల్కిచర్ల, భూత్పూర్ మండలం
కొరత లేదు
యూరియా దొరకదని తప్పుడు సమాచారం రావడంతో రైతులు భయపడి ఎక్కువగా కొనుక్కుంటున్నారు. ఎక్కడా కొరత లేదు. ప్రతిరోజు ఏదో ఓ మండలానికి వెళ్లి తనిఖీలు చేస్తున్నాం. సొసైటీల్లో స్టాకు ఉంది. ఇంకా రావాల్సి ఉంది. మనకు అవసరాన్ని బట్టి ఇండెంట్ ఇచ్చాం. వ్యాపారులు ఎరువుల కొరత సృష్టించి.. బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. యూరియా ఇప్పటి వరకు రైతులకు 15,419 మెట్రిక్ టన్నులు పంపిణీ చేశాం. మరో 3,751 మెట్రిక్ టన్నుల అందుబాటులో ఉంది. డీలర్లు అధిక ధరలకు యూరియా, ఇతర ఎరువులు అమ్మినా, లింక్ ద్వారా ఇతర ఎరువులు ఇచ్చినా.. కృత్రిమ కొరత సృష్టించినట్లు ఫిర్యాదు చేస్తే విక్రయదారులపై చర్యలు తీసుకుంటాం.
– బి.వెంకటేష్,
జిల్లా వ్యవసాయశాఖ అధికారి
● ఇప్పటి వరకు 27,977
టన్నులు సరఫరా
● పీఏసీఎస్‌ల వద్ద బారులు
తీరుతున్న వైనం
● అడిగినంత ఇవ్వడం లేదని రైతుల
అసంతృప్తి
● ధరలు పెంచి అమ్ముతున్న
ప్రైవేట్ వ్యాపారులు
మహబూబ్‌నగర్
(వ్యవసాయం): వానాకాలం సీజన్ ఆరంభమైంది. వర్షాలు అడపాదడపా పడుతున్నా.. సాగు పనులు ఊపందుకున్నాయి. అన్నదాతకు సాగు మొదలు నుంచి పంట అమ్మకం వరకు అన్నీ కష్టాలే. వ్యయ ప్రయాసలతో ఈ ఏడాది వానాకాలం సాగు పనులు మొదలుపెడితే ఎరువు బరువుగా మారింది. ఒకవైపు ధర పెరిగి భారంగా మారితే.. మరోవైపు ఎరువుల కృత్రిమ కొరత సృష్టిస్తున్నా రు. ప్రభుత్వం సరఫరా చేసిన డీఏపీని బ్లాక్ మార్కెట్‌కు తరలించి స్టాక్ లేదంటున్నా రు. ధరలు పెంచి రైతులను నిలువు దోపిడీ చేస్తున్నారు.
ప్రొడక్ట్ మార్క్‌ఫెడ్ సొసైటీల్లో ప్రస్తుతం జిల్లా
డీలర్స్ మొత్తం
యూరియా 1,136 366 709 2,605
డీఏపీ 2,000 60 268 447
ఎంవోపీ – 32 110 355
ఎస్‌ఎస్‌పీ – 44 205 394
కాంప్లెక్స్ 1,181 824 3,422 4,838
మొత్తం 4,317 1,326 4,714 8,639
కావాల్సిన ఎరువుల అంచనా (మెట్రిక్ టన్నుల్లో)
నెల యూరియా డీఏపీ ఎండోపీ కాంప్లెక్స్‌లు
ఆగస్టు 8,400 1243 103 7,500
సెప్టెంబర్ 5,920 356 228 5,600
అక్టోబర్ 1,557 217 185 1,700

ఎరువుల కోసం వెతలు

ఎరువుల కోసం వెతలు

ఎరువుల కోసం వెతలు

ఎరువుల కోసం వెతలు