
వరదొస్తే.. రాకపోకలు బంద్
దుందుభీ పరివాహక ప్రాంతాల ప్రజల అగచాట్లు
●
రాకపోకలు నిలిచిపోతాయి..
దుందుభీ వాగు ఉధృతి పెరిగిన ప్రతి సారి రాకపోకలు నిలిచి ఇబ్బందులు పడుతున్నాం. దుందుబీ వాగుపై బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని గత కొన్ని సంవత్సరా లుగా కోరుతున్నా ఇప్పటి వరకు పట్టించుకో లేదు. గత ప్రభుత్వ హయాంలోను బ్రిడ్జి నిర్మి స్తామంటూ ప్రకటించారు. కానీ కా ర్యరూపం దాల్చలేదు. ఇప్పటికై నా బ్రిడ్జి నిర్మించేందుకు పాలకులు చర్యలు తీసుకోవాలి.
– జర్పుల ఈరన్న, తుపుడగడ్డ తండా
అలుగు పారితే అంతే..
పోలేపల్లి–కిష్టారం మధ్య చెరువు అలుగు పారినప్పుడల్లా రాకపోకలు బంద్ అవుతాయి. ఉదండాపూర్, వల్లూరు మీదుగా జడ్చర్లకు వెళ్లాల్సి వస్తుంది. కిష్టారం–అంబటాపూర్ మధ్య కూడా వరద ప్రవాహం పెరిగినప్పుడు రాకపోకలు నిలిచిపోతాయి. బ్రిడ్జిల నిర్మాణం చేపడితే ఇబ్బందులు తప్పుతాయి.
– గోపాల్‌రెడ్డి, కిష్టారం
ప్రతిపాదనలు పంపించాం..
నియోజకవర్గంలోని దుందుభీ వాగు, తదితర ప్రాంతాలలో రాకపోకలకు ఇబ్బందిగా మారే దగ్గర బ్రిడ్జిల నిర్మాణం చేపడతాం. ఇప్పటికే 9 బ్రిడ్జిలకు రూ.44.10 కోట్లతో ప్రతిపాదనలు నివేదించాం. నిధులు మంజూరు కాగానే పనులు చేపడతాం. మిగతా చోట్ల కూడా బ్రిడ్జిల నిర్మాణం చేపట్టేందుకు చర్యలు తీసుకుంటాం.
– అనిరుధ్‌రెడ్డి, ఎమ్మెల్యే, జడ్చర్ల
జడ్చర్ల: వానాకాలం వచ్చిందంటే చాలు దుందుభీ పరివాహక ప్రాంతాల ప్రజల్లో ఆందోళన నెలకొంటుంది. వర్షాలు కురిసాయంటే చాలు వాగులు, వంకలు పారడం.. ఆయా ప్రాంతాల ప్రజలకు రాకపోకలు బంద్ కావడం ఏటా నిత్యకృత్యంగా మారింది. విధిలేని పరిస్థితుల్లో చుట్టూ కి.మీ.ల మేర తిరిగి వెళితే తప్ప ఇతర ప్రాంతాలకు వెళ్లలేని పరిస్థితి నియోజకవర్గంలోని పలు గ్రామాలు, తండాల ప్రజలు ఎదుర్కొంటున్నారు. జడ్చర్ల మండలంలోని కొండేడు–తుపుడగడ్డ తండాల మధ్య దుందుభీ వాగు ప్రవాహం ఉధృతమైన సమయంలో అటు ఇటుగా రాకపోకలు నిలిచిపోతాయి. రాకపోకలు సజావుగా సాగితే ఈ ప్రాంతాల మధ్య 2 కి.మీ.లు మాత్రమే ఉండగా వరద ముంచెత్తిన సమయంలో తుపుడగడ్డతండా నుంచి చిన్న ఆదిరాల, పెద్ద ఆదిరాల గ్రామాల మీదుగా దాదాపు 6 కి.మీ.ల మేర చుట్టూ తిరిగి రాకపోకలు సాగించాల్సి వస్తుందని తండా వాసులు తెలిపారు. నల్లకుంట తండా ప్రజల దుస్థితీ ఇదే. లింగంపేట–నల్లకుంటతండాల మధ్య దుందుభీ వాగు పొంగిపొర్లిన సమయంలో రాకపోకలు స్తంభిస్తాయి. దీంతో దాదాపు 6 కి.మీ.లకు పైగా చుట్టూ తిరిగి కోడ్గల్ నుంచి రావాల్సి ఉంటుంది. అదేవిధంగా కిష్టారం–అంబటాపూర్ మధ్య కూడా బ్రిడ్జి లేకపోవడంతో రాకపోకలు ఇబ్బందిగా మారాయి. పోలేపల్లి–కిష్ట్టారం మధ్య చెరువు అలుగు పారిన సమయంలో రాకపోకలు నిలిచి ఉదండాపూర్, వల్లూరు మీదుగా జడ్చర్లకు చేరుకోవాల్సి ఉంటుంది. నసరుల్లాబాద్ చెరువు అలుగు పారితే లోతట్టు ప్రాంతంలోని అల్వాన్‌పల్లి–తంగెళ్లపల్లి గ్రామాల మధ్య రాకపోకలు నిలిచి ఇబ్బందులు తలెత్తుతాయి. ఎక్వాయపల్లి–లింగందన గ్రామాల మధ్య దుందుభీ వాగు ప్రవహిస్తే రాకపోకలు స్తంభించి పోతాయి.
వంతెనలు లేక ఇబ్బందులు
నెక్కొండ–బైరంపల్లి గ్రామాల మధ్య కూడా బ్రిడ్జి నిర్మించాలన్న డిమాండ్ ఉంది. అదేవిధంగా రాజాపూర్ మండలంలోని దోండ్లపల్లి–ఇప్పటూరు గ్రామాల మధ్య దుందుభీ వాగు పారిన సందర్భంగా రాకపోకలు స్తంభించి చుట్టు దాదాపు 10 కి.మీ.ల మేర తిరిగి వెళ్లాల్సి వస్తుంది. రాపల్లె–కుచ్చర్‌కల్ మధ్య ఇదే పరిస్థితి నెలకొంది. ఇక బాలానగర్ మండలంలో 44వ నంబర్ జాతీయ రహదారి నుంచి ఉడిత్యాల, మోతి ఘన్‌పూర్,సూరారం మార్గంలో, శేరిగూడ–బోడ జానంపేట మధ్య కూడా బ్రిడ్జి నిర్మాణం చేయాల్సి ఉంది. నవాబ్‌పేట మండలంలోని వీరశట్పల్లి నుండి దయాపంతులపల్లి మీదుగా హాజీపూర్ వెళ్లే మార్గంలో బ్రిడ్జి ఏర్పాటు చేయాల్సి ఉంది. నవాబ్‌పేట–దయాపంతుల పల్లి,మల్లారెడ్డిపల్లి–కారూర్ మధ్య బ్రిడ్జిల నిర్మాణం చేపట్టాల్సి ఉంది. మిడ్జిల్ మండలంలో వల్లబురావుపల్లి నుంచి చౌటకుంటతండా మీదుగా వేముల మార్గంలో బ్రిడ్జి నిర్మాణం చేపడితే రాకపోకలకు సౌకర్యంగా ఉంటుంది. కొత్తూరు–వెలుగొమ్ముల మద్య దుందుభీ వాగుపై బ్రిడ్జి నిర్మాణం చేపట్టాల్సి ఉంది.
వంతెనలు నిర్మిస్తేనే ప్రయోజనం
దశాబ్దాలుగా ప్రజల ఎదురుచూపులు
తాజాగా నిధుల మంజూరుకుప్రతిపాదనలు

వరదొస్తే.. రాకపోకలు బంద్

వరదొస్తే.. రాకపోకలు బంద్

వరదొస్తే.. రాకపోకలు బంద్

వరదొస్తే.. రాకపోకలు బంద్