
శ్రీశైలంలో ఒక గేట్ పైకెత్తి..
దోమలపెంట: శ్రీశైలం ఆనకట్ట వద్ద ఆదివారం ఒక గేట్‌ను పది అడుగుల మేర పైకెత్తి 26,698 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఎగువన జూరాల ఆనకట్ట గేట్లు పైకెత్తి స్పిల్‌వే ద్వారా 31,504 క్యూసెక్కులు, విద్యుదుత్పత్తి చేస్తూ 34,088, సుంకేసుల నుంచి 52,682 క్యూసెక్కులు శ్రీశైలం జలాశయానికి చేరుతుందని వివరించారు. భూగర్భ కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ 35,315 క్యూసెక్కులు, ఏపీ జెన్‌కో పరిధిలోని కుడిగట్టు కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ 31,102 క్యూసెక్కుల నీటిని దిగువన ఉన్న నాగార్జునసాగర్‌కు విడుదల చేశారు. 24 గంటల వ్యవధిలో పోతిరెడ్డిపాడు ద్వారా 30 వేల క్యూసెక్కులు, హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా 2,401, ఎంజీకేఎల్‌ఐకు 1,600 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. భూగర్భ కేంద్రంలో 17.335 మి.యూ., కుడిగట్టు కేంద్రంలో 15.917 మి.యూ. విద్యుదుత్పత్తి చేశారు.