
సీజనల్ వ్యాధులు రాకుండా చర్యలు
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: నగరంలో ఎక్కడా సీజనల్ వ్యాధులు సోకకుండా తగు చర్యలు చేపట్టాలని డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డా.శశికాంత్, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ టి.ప్రవీణ్‌కుమార్‌రెడ్డి సూచించారు. శుక్రవారం స్థానిక మున్సిపల్ కార్పొరేషన్ సమావేశ మందిరంలో ఆశా కార్యకర్తలు, మున్సిపల్ జవాన్లు, మెప్మా ఆర్‌పీలకు ఒకరోజు శిక్షణ శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దోమల నివారణకు ప్రతినిత్యం ఇంటింటికీ వెళ్లి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకునేలా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ప్రస్తుతం వర్షాకాలం కావడంతో డెంగీ, మలేరియా, జ్వరాలు తదితర వ్యాధులు ప్రబలకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఇంటి ఆవరణలోని నీటి డ్రమ్ములు, పాత టైర్లు, సంప్‌లను ఎప్పటికప్పుడు శుభ్రం చేయించాలన్నారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లోని ఓపెన్ ప్లాట్లలో నిలిచే నీటిలో, మురుగు కుంటలలో లార్వా ఏర్పడకుండా ఆయిల్ బాల్స్ వేయాలన్నారు.