
వక్ఫ్ భూముల్లో వెలసిన ఇళ్లు, వాటర్ ప్లాంట్..
గుడిమల్కాపూర్‌లోని సర్వేనంబర్ 49లో 7.07 ఎకరాల్లో వక్ఫ్ భూములు ఉన్నాయి. ప్రధాన సెంటర్‌లో దర్గా స్థలాలు ఉండడంతో కమర్షియల్‌గా డిమాండ్ ఎక్కువగా ఉంది. వక్ఫ్ భూమికి ముగ్గురు అన్నదమ్ములు అనుభవదారులుగా ఉన్నారు. అయితే ఈ భూములను వారివారి వారసులకు గతంలోనే పంపకాలు చేశారు. నిబంధనల ప్రకారం ఇనాం భూములను అనుభవించాల్సిందే తప్ప.. ఎలాంటి అమ్మకాలు, కొనుగోలు చేయరాదు. కానీ వారి వారసులు ఇటీవల లోపాయికారీగా ఈ భూములను గజాల చొప్పున అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారు. ఈ భూముల్లో వాటర్‌ప్లాంట్లు, ఇళ్లు వెలియడమే ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి.

వక్ఫ్ భూముల్లో వెలసిన ఇళ్లు, వాటర్ ప్లాంట్..