
రూ.2 కోట్ల విలువైన 2 ఎకరాలు మాయం..
గుడిమల్కాపూర్ సెంటర్‌లో వక్ఫ్ బోర్డుకు సంబంధించిన భూముల్లో ఎకరా వరకు దర్గా నిర్మించారు. గత ప్రభుత్వ హయాంలో ఎకరా వరకు పల్లె ప్రకృతి వనానికి కేటాయించగా.. చెట్లు ఏపుగా పెరిగాయి. మరోవైపు గ్రామానికి ఆనుకుని ఉన్న ఈ భూముల్లో సుమారు 3 ఎకరాలను పలువురు వ్యవసాయానికి అనుకూలంగా మార్చుకుని కొన్నేళ్లుగా సాగు చేస్తున్నారు. రియల్‌ఎస్టేట్ దందాతో మిగతా రెండెకరాలకు పైగా అన్యాక్రాంతం కాగా.. దీని విలువ రూ.2 కోట్లకు పైగా ఉంటుందని స్థానికులు చెబుతున్నారు.
మలక్‌బాద్‌షా, ములుక్ బాద్‌షాల దర్గా