
కాంగ్రెస్ పార్టీతోనే సామాజిక న్యాయం
స్టేషన్ మహబూబ్‌నగర్: కాంగ్రెస్ పార్టీతోనే సామాజిక న్యాయం సాధ్యమని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. జిల్లాకేంద్రంలోని కాంగ్రెస్ కార్యాలయంలో శుక్రవారం జిల్లా రైతుబంధు మాజీ అధ్యక్షుడు గోపాల్‌యాదవ్, మాజీ కౌన్సిలర్లు పద్మజ, రామకృష్ణతో పాటు కుర్వ సత్యం, బీజేపీ, బీఆర్‌ఎస్‌లకు చెందిన భారీగా కార్యకర్తలు ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం రేవంత్‌రెడ్డి సారథ్యంలో జరుగుతున్న అభివృద్ధి గత 75 ఏళ్ల కాలంలో ఎన్నుడూ జరగలేదన్నారు. 16 నెలల కాలంలో సుమారు రూ.260 కోట్లతో మహబూబ్‌నగర్‌లో సమాంతరంగా అభివృద్ధి చేశామని, ప్రతి కాలనీలో రోడ్లు, డ్రెయినేజీలు, ఇతర అభివృద్ధి పనులు పూర్తిచేసినట్లు తెలిపారు. బీసీ రిజర్వేషన్ కోసం సీఎం చేస్తున్న కృషిని రాహుల్‌గాంధీ కొనియాడారన్నారు. కేంద్ర ప్రభుత్వం, సీఎం రేవంత్‌రెడ్డి సహకారంతో తెలంగాణలోనే అత్యధికంగా నిధులు తెచ్చి మహబూబ్‌నగర్‌ను బ్రహ్మంగా అభివృద్ధి చేసుకునే సువర్ణ అవకాశం మనకు వచ్చిందన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో మహబూబ్‌నగర్ కార్పొరేషన్‌లోని 60 స్థానాల్లో గెలుపొంది సీఎంకు బహుమతిగా ఇద్దామని పిలుపునిచ్చారు. టీజీఎంఎఫ్‌సీ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి ఘనమైన చరిత్ర ఉందని, అధికారమే పరమవాదిగా పనిచేసే పార్టీ కాదన్నారు. రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా పనిచేద్దామని కోరారు. కార్యక్రమంలో ముడా చైర్మన్ లక్ష్మణ్‌యాదవ్, గ్రంథాలయ చైర్మన్ మల్లు నర్సింహారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ బెక్కరి అనిత, వైస్ చైర్మన్ విజయ్‌కుమార్, మున్సిపల్ మాజీ చైర్మన్ ఆనంద్‌గౌడ్, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు వసంత, నాయకులు ఎన్‌పీ వెంకటేశ్, చంద్రకుమార్‌గౌడ్, ఎం.సురేందర్‌రెడ్డి, అమరేందర్‌రాజు, సిరాజ్‌ఖాద్రీ, రాఘవేందర్‌రాజు, సీజే బెనహర్, సాయిబాబా, రాములుయాదవ్, అజ్మత్‌అలీ, అవేజ్, ఫయాజ్, నాగరాజు, బండి మల్లేష్ పాల్గొన్నారు.