పాలమూరులో పోకిరీలు | - | Sakshi
Sakshi News home page

పాలమూరులో పోకిరీలు

Jul 25 2025 8:03 AM | Updated on Jul 25 2025 8:07 AM

పాలమూ

పాలమూరులో పోకిరీలు

‘మహబూబ్‌నగర్‌ రూరల్‌ మండలంలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయుడు కొన్నిరోజుల నుంచి పదో తరగతి విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. దీంతో ఈ నెల 4న విద్యార్థులు షీటీం పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదుతో పాఠశాలను పరిశీలించి జరిగిన ఘటనపై విచారణ చేయగా ఉపాధ్యాయుడు తప్పుగా ప్రవర్తించినట్లు తేలింది. దీంతో సదరు ఉపాధ్యాయుడిపై రూరల్‌ పోలీస్‌స్టేషన్‌లో పోక్సో కేసు నమోదు చేశారు.’

మహమ్మదాబాద్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన 15 ఏళ్ల బాలికపై జీలకరపురం కృష్ణయ్య లైంగిక దాడి చేయడంతో 376(2) ఐపీసీతో పాటు పోక్సో యాక్ట్‌ కింద కేసులు నమోదయ్యాయి. దీనిపై చార్జీషీట్‌ దాఖలు చేసి కోర్టులో హాజరుపరచగా ఈ నెల 17న ప్రత్యేక సెషన్స్‌ కోర్టు న్యాయమూర్తి నిందితుడు కృష్ణయ్యకు జీవితఖైదుతోపాటు రూ.10 వేల జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చారు.

ఉమ్మడి జిల్లాలో ఏటా పెరుగుతున్న పోక్సో కేసులు

ఆందోళన కలిగిస్తున్న అఘాయిత్యాలు

కీచకులుగా మారుతున్న పలువురు ఉపాధ్యాయులు

పాఠశాలల్లోనూ విద్యార్థినులౖపైలెంగిక దాడులు

నాలుగేళ్లలో 1,412 కేసులు నమోదు

మహబూబ్‌నగర్‌ క్రైం: ఉమ్మడి జిల్లాలో రోజురోజు కూ పాఠశాలలు, కళాశాలలకు వెళ్తున్న బాలికలు, అమ్మాయిలపై వేధింపులు పెరుగుతున్నాయి. దీనికి కారకులపై కూడా పోక్సో కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. అమ్మాయిలను ఇబ్బందులకు గురిచేస్తున్న వారిలో బాలురు కూడా ఎక్కువగానే ఉన్నారు. ఇంట్లో తల్లిదండ్రుల పర్యవేక్షణ లేకుండా జులాయిగా తిరిగే కొందరు యువకులే ఎక్కువగా ఇలాంటి చేష్టలకు పాల్పడుతున్నారు. కొందరైతే పనిగట్టుకొని పాఠశాలలు, కళాశాలలు ప్రారంభం, వదిలే సమయానికి బైక్‌లపై ఉంటూ వచ్చిపోయే వారిని టీజ్‌ చేయడం సర్వసాధారణంగా మారింది. అయితే కొందరు బాధితులు ధైర్యంగా పోలీసులకు ఫిర్యా దులు చేస్తుంటే.. మరికొందరు సర్దుకుపోతున్నారు. ఇలాంటి వారిని అలుసుగా తీసుకొని కొందరు యు వకులు మరింత రెచ్చిపోతున్నారు. ఉమ్మడి జిల్లాలో 2022 నుంచి 1,412 పోక్సో కేసులు నమో దయ్యాయి. అందులో అత్యధికంగా మహబూబ్‌నగర్‌లో 451, నాగర్‌కర్నూల్‌లో 327, గద్వాలలో 234, నారాయణపేటలో 211, వనపర్తిలో 189 కేసులున్నాయి.

నిత్యం తనిఖీలు చేస్తే..

మహిళా, శిశు సంక్షేమ శాఖ పరిధిలోని బాలల పరిరక్షణ, పోలీస్‌శాఖ ఆధ్వర్యంలోని షీటీం బృందాలు తనిఖీలు చేపడుతున్నారు. అయితే క్షేత్రస్థాయిలో ఈ తనిఖీలు మరింతగా పెరగాలి. ముఖ్యంగా బాలికల హక్కుల పరిరక్షణతో పాటు వారు ఎదుర్కొంటున్న సమస్యలపై నిత్యం తనిఖీలు చేయడం చాలా అవసరం. వసతి గృహాలు, పాఠశాలలు, గురుకులాలకు వెళ్లి చిన్నారులు తమ బాధలు చెప్పుకొనే అవకాశం ఇవ్వాలి. ఎక్కడైనా అనుమానంగా అనిపించినా.. బాలికలకు సరైన రక్షణ అందని పరిస్థితులను గుర్తించినా తగు చర్యలు తీసుకోవాలి.

అవగాహన కల్పిస్తున్నాం..

జిల్లాలో షీటీం బృందాలు విద్యార్థినులు, అమ్మాయిలను వేధిస్తున్న ఆకతాయిలను అదుపులోకి తీసుకుని వారి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్‌ నిర్వహిస్తున్నారు. ఘటనలు తీవ్రంగా ఉంటే కేసులు నమోదు చేస్తున్నాం. అన్ని రకాల పాఠశాలల్లో పోక్సో, అమ్మాయిల రక్షణ, గుడ్‌ టచ్‌– బ్యాడ్‌ టచ్‌, ఈవ్‌ టీజింగ్‌ వంటి వాటిపై అవగాహన కల్పిస్తున్నాం. అమ్మాయిలు సెల్ఫ్‌ కాన్ఫిడెన్స్‌, సెల్ఫ్‌ డిఫెన్స్‌ వంటివి మెరుగుపరుచుకోవాలి. సోషల్‌ మీడియా వల్ల జరుగుతున్న నష్టాలపై చైతన్యం చేస్తున్నాం.

– జానకి, ఎస్పీ, మహబూబ్‌నగర్‌

అండగా సఖి కేంద్రం..

వివిధ రూపాల్లో దాడులకు గురైన మహిళలకు సఖి కేంద్రం అండగా ఉంటుంది. మైనర్లపై అత్యాచారాలు, లైంగిక దాడులు, పరువు హత్యలు, యాసిడ్‌ దాడులు, వరకట్నం వంటి అన్ని రకాల వేధింపుల నుంచి రక్షించడానికి కృషి చేస్తోంది. 18 ఏళ్ల లోపు బాలికలతో పాటు మహిళలకు ఏదైనా సమస్య వస్తే సఖి కేంద్రాన్ని ఆశ్రయిస్తారు. అలాగే టోల్‌ఫ్రీ నం.181కు ఫోన్‌ చేసి సమస్యను చెప్పవచ్చు.

– సౌజన్య, సఖి కేంద్రం కో–ఆర్డినేటర్‌, మహబూబ్‌నగర్‌

చిన్నప్పటి నుంచే..

లైంగిక వేధింపుల గురించి పిల్లలకు చిన్నప్పటి నుంచే అవగాహన కల్పించాలి.

వేధింపులకు గురైతే ఎవరి సహాయం కోరాలి.. ఎలా స్పందించాలో వివరంగా చెప్పాలి.

ఒంటరిగా ఎక్కడికీ వెళ్దొదని, వెళ్లినప్పుడు ఎలా జాగ్రత్తగా ఉండాలో వివరించాలి.

శరీరంలోని ఏ భాగాలను ఇతరులు తాకకూడదనే విషయాన్ని వారికిఅర్థమయ్యేలా చెప్పాలి.

ఎవరైనా అనుచితంగా ప్రవర్తిస్తే ముట్టొద్దు అని గట్టిగా అరవడం, అక్కడి నుంచి పారిపోవడం, ఎదురించడం వంటివి తెలియజెప్పాలి.

పాలమూరులో పోకిరీలు1
1/3

పాలమూరులో పోకిరీలు

పాలమూరులో పోకిరీలు2
2/3

పాలమూరులో పోకిరీలు

పాలమూరులో పోకిరీలు3
3/3

పాలమూరులో పోకిరీలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement