
అదుపుతప్పిన బైక్.. వ్యక్తి మృతి
బల్మూర్: ౖబెక్ అదుపుతప్పిన ఘటనలో వ్యక్తి మృతి చెందిన సంఘటన మండలంలోని మైలారం– అంబగిరి రహదారిపై మంగళవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. ఎస్‌ఐ రాజేందర్ తెలిపిన వివరాలు.. లింగాల మండలం ఎంసీ తండాకు చెందిన కాట్రావత్ కిషన్‌నాయక్(35) మంగళవారం అచ్చంపేటకు వెళ్లి రాత్రి 11: గంటల సమయంలో స్వగ్రామానికి తిరిగి వస్తుండగా మార్గమధ్యలోని మైలా రం సమీపంలో మలుపు వద్ద అదుపు తప్పి బైక్ బోల్తా పడింది. ప్రమాదంలో తలకు తీవ్ర గాయా లు కావడంతో కిషన్‌నాయక్ అక్కడికక్కడే మృతి చెందినట్లు ఎస్‌ఐ తెలిపారు. మృతుని భార్య పద్మ ఫిర్యాదు మేరకు బుధవారం కేసు నమోదు చేసి మృతదేహనికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు పేర్కొన్నారు. మృతుడికి భార్య, కూమార్తె, కుమారుడు ఉన్నారు. ప్రమా దం జరిగిన ప్రదేశంలో అడవిపందులు గుంపు సంచరించినట్లు గుర్తులు ఉన్నాయని వాటి కారణంగానే బైక్ అదుపుతప్పి కిందపడినట్లు స్థానికులు, కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

అదుపుతప్పిన బైక్.. వ్యక్తి మృతి