అప్పుడే.. లోకల్‌ ఫైట్‌! | - | Sakshi
Sakshi News home page

అప్పుడే.. లోకల్‌ ఫైట్‌!

Jul 24 2025 7:08 AM | Updated on Jul 24 2025 7:08 AM

అప్పుడే.. లోకల్‌ ఫైట్‌!

అప్పుడే.. లోకల్‌ ఫైట్‌!

జడ్చర్లలో 100 పడకల ఆస్పత్రి వద్ద మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి కుటుంబసభ్యులు అక్రమంగా తీసుకున్న అసైన్డ్‌ ల్యాండ్‌ను ప్రభుత్వానికి అప్పగించాలి. సిగ్నల్‌గడ్డ రోడ్డు విస్తరణకు సంబంధించి పాత బస్టాండ్‌ వైపు నేరుగా వాహనాలు వెళ్లేందుకు మార్గం లేదు. డిజైన్‌ లోపంతో ఇబ్బందులు వస్తాయి.

– జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి

ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి సొంత ఊరు రంగారెడ్డిగూడ దేవాలయం భూములపై శ్వేతపత్రంవిడుదల చేయాలి. సిగ్నల్‌గడ్డ రోడ్డు విస్తరణ పనుల డిజైన్‌లో ఎలాంటి లోపాలు లేవు. పోలేపల్లి సెజ్‌ నుంచి నా ఖాతాకు డబ్బులు వచ్చాయని ఆరోపణలను రుజువు చేయాలి. లేకపోతే క్షమాపణలు చెప్పాలి.

– లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యే

ఎమ్మెల్యే అనడం కన్నా.. 1300 ఓట్లతో గెలిచిన గఫ్లత్‌ ఎమ్మెల్యే అంటే బాగుంటుంది. అటువంటి ఎమ్మెల్యే కల్లు తాగిన కోతి లాగా ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన హరీశ్‌రావును విమర్శిస్తున్నాడు. సీఎం రేవంత్‌రెడ్డితో మెప్పు పొందాలనే ఈ విమర్శలు చేస్తున్నాడు.

– దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే

ఆల వెంకటేశ్వర్‌రెడ్డి

మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి అవినీతి చిట్టనా దగ్గర ఉంది. భారీగా ఆస్తులు సంపాదించాడు. పదేళ్లుగా నియోజకవర్గ కేంద్రాన్ని గాలి కొదిలేశాడు.

– దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్‌రెడ్డి

షెడ్యూల్‌ విడుదలకు ముందుగానే చేరికలకు తెరలేపిన పార్టీలు

ముఖ్య నేతల మధ్య పేలుతున్న మాటల తూటాలు

గెలుపే లక్ష్యంగా ప్రధాన రాజకీయ పక్షాల కసరత్తు

సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలతో ‘హస్తం’ ముందడుగు

ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేలా ‘కారు’ కార్యాచరణ

పట్టు సాధించాలనే తపనతో ‘కమలం’

స్థానిక ఎన్నికల వేళ వేడెక్కినరాజకీయం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement