
విద్యుదుత్పత్తి కేంద్రాన్ని సందర్శించిన శ్రీశైలం ఈఓ
దోమలపెంట: భూగర్భ జల విద్యుదుత్పత్తి కేంద్రాన్ని మంగళవారం శ్రీశైలం దేవస్థానం ఈఓ శ్రీనివాసరావు సందర్శించారు. ఆయనకు కేంద్రం చీఫ్ ఇంజినీర్ కేవీవీ సత్యనారాయణ, ఎస్‌ఈ (సివిల్) రవీంద్రకుమార్, ఎస్‌ఈ (ఓఅండ్‌ఎం) ఆదినారాయణ, డీఈ (కేంద్రం సేఫ్టీ) శ్రీకుమార్‌గౌడ్ స్వాగతం పలికి సత్కరించారు. కేంద్రంలో విద్యుదుత్పత్తి, విద్యుత్‌ను టీజీ లోడ్ డిస్పాచ్‌కు సరఫరా చేస్తున్న విధానాన్ని సీఈ ఆలయ ఈఓకు వివరించారు. అనంతరం సమావేశ మందిరంలో ఈఓ కేంద్రం సీఈ, ఎస్‌ఈలు, డీఈ, ఎస్‌పీఎఫ్ ఆర్‌ఐ రవి, ఎస్‌పీఎఫ్ ఎస్‌ఐ అనూప్‌ను దేవస్థానం కండువాలతో సత్కరించి ప్రసాదాన్ని అందజేశారు. భూగర్భ కేంద్రానికి అవసరమైతే ఆలయ వేద పండితుల సహకారం అందిస్తామన్నారు.