
జూరాలకు తగ్గిన ఇన్‌ఫ్లో
ధరూరు/ఆత్మకూర్: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి వచ్చే వరద స్వల్పంగా తగ్గినట్లు పీజేపీ అధికారులు తెలిపారు. సోమవారం రాత్రి 8 గంటలకు 67 వేల క్యూసెక్కుల వరద వస్తుందని పేర్కొన్నారు. ప్రాజెక్టు 8 క్రస్టు గేట్లను ఎత్తి 31,806 క్యూసెక్కులు, విద్యుదుత్పత్తి కోసం 31,464 క్యూసెక్కులు, కోయిల్‌సాగర్‌కు 315 క్యూసెక్కులు, నెట్టెంపాడుకు 750 క్యూసెక్కులు, ఆవిరి రూపంలో 66 క్యూసెక్కులు, ఎడమ కాల్వకు 1,250 క్యూసెక్కులు, కుడి కాల్వకు 600 క్యూసెక్కులు, ఆర్‌డీఎస్ లింక్ కెనాల్‌కు 150 క్యూసెక్కులు, భీమా లిఫ్టు–2కు 750 క్యూసెక్కులు, సమాంతర కాల్వకు 700 క్యూసెక్కులు కలిపి ప్రాజెక్టు నుంచి మొత్తం 67,001 క్యూసెక్కుల నీటిని దిగువన శ్రీశైలం ప్రాజెక్టుకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం ప్రాజెక్టులో 7.663 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు పీజేపీ అధికారులు తెలిపారు. జూరాల ఎగువ విద్యుదుత్పత్తి కేంద్రంలో 5 యూనిట్లలో 195 మెగావాట్లు, దిగువన 6 యూనిట్ల ద్వారా 240 మెగావాట్ల విద్యుదుత్పత్తి చేస్తున్నట్లు ఎస్‌ఈ శ్రీధర్ తెలిపారు.
ఆల్మట్టికి 52,305 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో
ఆల్మట్టి ప్రాజెక్టుకు 52,305 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా.. 60వేల క్యూసెక్కుల నీటిని దిగువన ఉన్న నారాయణపూర్ ప్రాజెక్టుకు విడుదల చేస్తున్నారు. ఆల్మట్టి పూర్తి స్థాయి నీటి నిల్వ 129.72 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 97.00 టీఎంసీల నీరు నిల్వ ఉంది. నారాయణపూర్ ప్రాజెక్టుకు 70వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా.. 20 క్రస్టు గేట్లను ఎత్తి జూరాలకు ప్రాజెక్టుకు 65,955 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. పూర్తి స్థాయి నీటి మట్టం 37.64 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 33.313 టీఎంసీల నీరు నిల్వ ఉంది.
10 గేట్ల ద్వారా నీటి విడుదల
రాజోళి: సుంకేసుల డ్యాంకు ఎగువ నుంచి 46వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రాగా.. 10 గేట్లను తెరిచి 43,450 క్యూసెక్కులు దిగువకు, కేసీ కెనాల్‌కు 1,540 క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్లు జేఈ మహేంద్ర పేర్కొన్నారు.
శ్రీశైలంకు కొనసాగుతున్న ప్రవాహం
దోమలపెంట: జూరాల ఆనకట్ట స్పిల్‌వే ద్వారా 31,464 క్యూసెక్కులు, విద్యుదుత్పత్తి చేస్తూ 31,806, సుంకేసుల నుంచి 39,105 మొత్తం కలిపి 1,02,375 క్యూసెక్కుల నీటి ప్రవాహం శ్రీశైలం వస్తుంది. శ్రీశైలం భూగర్భ కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ 35,315 క్యూసెక్కులు, ఏపీ జెన్కో పరిధిలోని కుడిగట్టు కేంద్రంలో ఉత్పత్తి చేస్తూ 32,236 మొత్తం 67,551 క్యూసెక్కుల నీటిని దిగువున సాగర్‌కు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో 883.4 అడుగుల వద్ద 206.97 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ఇరవై నాలుగు గంటల వ్యవధిలో పోతిరెడ్డిపాడు ద్వారా 20 వేల క్యూసెక్కులు, హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్ లిఫ్ట్ ద్వారా 1,013 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. భూగర్భ కేంద్రంలో 17.585 మిలియన్ యూనిట్లు, కుడిగట్టు కేంద్రంలో 17.287 మి.యూనిట్లు విద్యుదుత్పత్తి చేశారు. స్థానికంగా 27.40 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది.
72వేల క్యూసెక్కుల ప్రవాహం
8 క్రస్టు గేట్ల ఎత్తివేత
67,001 క్యూసెక్కుల నీరు దిగువకు..