
తెలంగాణ జట్టుకు ఘన విజయాలు
మహబూబ్‌నగర్ క్రీడలు: తమిళనాడు రాష్ట్రంలోని సేలంలో ఈ నెల 17 నుంచి 20 వరకు జరిగిన వివిధ సౌత్‌జోన్ నేషనల్ నెట్‌బాల్ పోటీల్లో తెలంగాణ పురుష, మహిళా జట్లు అద్భుతమైన ప్రతిభను కనబరిచినట్లు నెట్‌బాల్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ అధ్యక్షుడు విక్రం ఆదిత్యరెడ్డి అన్నారు. 2వ ఫాస్ట్ 5 సౌత్‌జోన్ నేషనల్ నెట్‌బాల్ పోటీల్లో తెలంగాణ పురుషుల, మహిళా జట్లు బంగారు పతకాలు, 17వ సౌత్‌జోన్ ట్రెడిషనల్ నేషనల్ పోటీల్లో మహిళా జట్టు రజతం, పురుషుల జట్టు కాంస్యం, 1వ సౌత్‌జోన్ మిక్స్‌డ్ నేషనల్ పోటీల్లో రాష్ట్ర జట్టు కాంస్య పతకాలు సాధించాయన్నారు. ఆయా జట్లను నెట్‌బాల్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ ప్రతినిధులు అభినందించారు. క్రీడాకారుల కృషి, కోచ్‌ల మార్గదర్శనంతో ఈ విజయాలు సాధించినట్లు తెలిపారు.
సౌత్‌జోన్ నేషనల్ నెట్‌బాల్ పోటీల్లో సత్తా
2 బంగారు, రజతం, 2 కాంస్య పతకాలు

తెలంగాణ జట్టుకు ఘన విజయాలు