
నాలగు ఇళ్లలో చోరీకి యత్నం
గద్వాల క్రైం: గుర్తు తెలియని దుండగులు తాళం వేసిన ఇళ్లల్లో చోరీకి ప్రయత్నిస్తుండగా కాలనీ వాసులు కేకలు వేయడంతో తప్పించుకున్న ఘటన సోమవారం పట్టణంలో జరిగింది. స్థానికులు తెలిపిన కథనం మేరకు.. గద్వాల పట్టణంలోని వేణుకాలనీలో నివాసం ఉంటున్న సాయిప్రకాష్ (ఎంపీడీఓ), బుగ్గారెడ్డి, అశోక్‌కుమార్ (రెవెన్యూ ఇన్‌స్పెక్టర్), సందీప్ ఇళ్లకు తాళాలు వేసి బంధువుల ఇళ్లకు వెళ్లారు. ఈ క్రమంలో సోమవారం తెల్లవారుజామున గుర్తు తెలియని దుండగులు ఒకేసారి వారి ఇళ్లల్లో చోరీకి యత్నించారు. ఈ క్రమంలో అశోక్‌కుమార్ ఇంట్లో బెడ్రూం తలుపులు ధ్వంసం చేస్తున్న క్రమంలో ఇంటి పక్కన నివాసముంటున్న మహేష్ కేకలు వేయడంతో దొంగలు పరారయ్యారు. కాలనీ వాసులు పట్టుకునేందుకు ప్రయత్నించినా పరారైనట్లు పేర్కొన్నారు. అనంతరం కాలనీవాసులు పట్టణ పోలీసులకు సమాచారం అందించారు. పట్టణ ఎస్‌ఐ కళ్యాణ్‌కుమార్ సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. నాలుగు ఇళ్లలో ఎలాంటి నగదు, ఆభరణాలు అపహరణకు గురికానట్లు పేర్కొన్నారు. సీసీ కెమెరాల ఫుటేజీల ఆధారంగా నిందితులను గుర్తించేందుకు విచారణ చేస్తున్నట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు.
తాళం వేసిన ఇళ్లే టార్గెట్