అమ్మో.. భారీ కొండచిలువ | - | Sakshi
Sakshi News home page

అమ్మో.. భారీ కొండచిలువ

Jul 22 2025 8:31 AM | Updated on Jul 22 2025 8:31 AM

అమ్మో.. భారీ  కొండచిలువ

అమ్మో.. భారీ కొండచిలువ

కొత్తకోట: పెబ్బేరు మండలం చెలిమిల్ల గ్రామంలోని ఓ ఇంటి ఆవరణలో భారీ కొండచిలువ ప్రత్యక్షమైంది. వివరాల్లోకి వెళితే.. ఆదివారం రాత్రి గ్రామానికి చెందిన చెన్నకేశవ తన ఇంటి ఆవరణలో నిద్రిస్తుండగా ఓ భారీ కొండచిలువ అతడి పక్కకు చేరింది. ఈ క్రమంలో సోమవారం తెల్లవారుజామున కుక్కల అరుపులకు చెన్నకేశవ నిద్ర లేచి చూడగా తన పక్కనే కొండచిలువ కనిపించడంతో కంగుతిన్నాడు. వెంటనే గ్రామస్తులను పిలవడంతో వారి అరుపులకు కొండచిలువ ఇంటి మెట్ల కింద ఓ మూలకు చేరింది. గ్రామస్తులు వనపర్తికి చెందిన స్నేక్‌ క్యాచర్‌ కృష్ణసాగర్‌కు సమాచారం అందించారు. కృష్ణసాగర్‌తో పాటు ఫారెస్ట్‌ సెక్షన్‌ అధికారి విజయ్‌ గ్రామానికి చేరుకొని కొండచిలువను పట్టుకున్నారు. కొండ చిలువ సుమారు 26 కేజీల బరువు, 5 మీటర్ల పొడవు ఉన్నట్లు అధికారులు తెలిపారు. అనంతరం కొండచిలువలను సమీప అటవీ ప్రాంతంలో వదిలేసినట్లు ఫారెస్ట్‌ సెక్షన్‌ అధికారి విజయ్‌ పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement