
విరబూసిన బ్రహ్మకమలాలు
ఉమ్మడి జిల్లాలోని పలువురి ఇళ్లలో ఆదివారం రాత్రి అరుదైన బ్రహ్మకమలాలు వికసించాయి. కోస్గిలోని బహర్‌పేటకు వీధికి చెందిన మిస్కిన్ శ్రీనివాస్ ఇంటి ఆవరణలో మూడేళ్ల క్రితం మొక్క నాటగా.. శనివారం రాత్రి ఏకంగా తొమ్మిది పుష్పాలు విరబూసాయి. విషయం తెలుసుకున్న కాలనీవాసులు అక్కడికి చేరుకొని బ్రహ్మకమలాలకు ప్రత్యేక పూజలు చేశారు. అలాగే జడ్చర్లకు చెందిన సుజాత గృహంలోనూ శనివారం రాత్రి ఒకటి, ఆదివారం మరో పువ్వు వికసించింది. వికసించిన బ్రహ్మకమలం చూస్తే అన్ని శుభాలు కలుగుతాయని నమ్ముతారు.
– జడ్చర్ల టౌన్/ కోస్గి రూరల్

విరబూసిన బ్రహ్మకమలాలు