
యూరియా కోసం పడిగాపులు
యూరియా కోసం రైతులు చాలా రోజుల తర్వాత క్యూలైన్లు కట్టారు. దీంతో యూరియా సెంటర్ల వద్ద రైతుల పడిగాపులు మొదలయ్యాయి. శనివారం మండల కేంద్రంలోని యూరియా కేంద్రాల్లో రైతులు క్యూ కట్టారు. రెండు రోజులుగా వర్షాలు కురుస్తుండడంతో ఒక్కసారిగా రైతులు శనివారం ఎరువుల దుఖానాలకు పోటెత్తారు. ఎక్కడ చూసిన అన్నదాత క్యూలైన్లు కనిపించాయి. చాలారోజుల తర్వాత యూరియా కొరత ఉందంటూ రైతులు ఎగబడడంతో పాత రోజులు గుర్తుకొచ్చాయి. దీంతోపాటు పోలీసుల పహారాలో రైతులకు ఎరువులు అందించే పరిస్థితి వచ్చింది. – నవాబుపేట