మైసమ్మ అడవిలో అధికారుల పర్యటన | - | Sakshi
Sakshi News home page

మైసమ్మ అడవిలో అధికారుల పర్యటన

Jul 19 2025 3:58 AM | Updated on Jul 19 2025 3:58 AM

మైసమ్మ అడవిలో అధికారుల పర్యటన

మైసమ్మ అడవిలో అధికారుల పర్యటన

నవాబుపేట: మండలంలోని మైసమ్మ ఆలయానికి 5 ఎకరాల అటవీ భూమి కేటాయింపుపై శుక్రవారం రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించారు. మైసమ్మ ఆలయానికి అటవీ భూమి కేటాయించి, ఆలయ అభివృద్ధికి సహకరించాలని దాదాపు 20 ఏళ్లుగా విజ్ఞప్తులు అందుతున్నాయి. కాగా దీనికి సంబంధించిన ఫైల్‌ సంబంధిత అటవీశాఖ అధికారులతో ఉండగా.. తాజాగా మరోసారి అటవీ భూమిలో క్షేత్రస్థాయి పర్యటన చేయాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. ఈ తరుణంలో ఆర్‌ఓఎఫ్‌ఆర్‌ సర్టిఫికెట్‌ ఇచ్చేందుకు శుక్రవారం ఆర్డీఓ నవీన్‌, జిల్లా అధికారులతో కలిసి ఆలయ పరిసరాల్లో సర్వే నిర్వహించి, ఆ ప్రాంతంలో ఉన్న చెట్లు, ఇతర అంశాల గురించి చర్చించారు. దేవాలయ అవసరాలకు కావాల్సిన భూమిని ఇవ్వాలని, దీనికి గాను అదనంగా వేరే చోట దాదాపుగా 12 ఎకరాల భూమిని అటవీశాఖకు అప్పగించేలా రెవెన్యూ అధికారులు గతంలోనే రికార్డులు అందించారు. దీంతో 5 ఎకరాల అటవీ భూమిని దేవాలయానికి ఇచ్చేలా ప్రతిపాదన సిద్ధమైంది.

అభివృద్ధికి ఆటంకం

దేవాలయం ఉన్న ప్రాంతం మినహా ఇతర ప్రదేశాల్లో ఎలాంటి నిర్మాణాలకు అటవీ శాఖ అధికారు లు అనుమతి ఇవ్వటం లేదు. దీంతో ఆలయం ఆవరణలో చాలా అబివృద్ధి పనులు నిలిచిపోయాయి. అందరి ఆకాంక్ష మేరకు భూమి కేటాయింపు జరిగితే ఆలయం మరింత అభివృద్ధి చెందుతుందని భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ శ్రీనివాస్‌, మైసమ్మ ఆలయ చైర్మన్‌ జగన్మోహన్‌రెడ్డి, ఈఓ నర్సింహులు, రామస్వామి, రవి, నారాయణరెడ్డి, యాదయ్య, బాలయ్య, గోపాల్‌ తదితరులు ఉన్నారు.

దేవాలయానికి

భూ కేటాయింపులపై విచారణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement