
బంగారం చోరీ కేసు ఛేదన
రాజోళి: శాంతిగనర్‌లోని బంగారు దుకాణంలో నగలను చోరీ చేసిన దుండగులను అరెస్ట్ చేసినట్లు సీఐ టాటాబాబు తెలిపారు. బుధవారం ఆయన శాంతిగనర్ పోలీస్‌స్టేషన్‌లో విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. శాంతిగనర్‌లోని శ్రీనివాస జ్యూవెల్లర్స్‌లో ఈనెల 3వ తేదీన గుర్తు తెలియని వ్యక్తులు మాస్కులు వేసుకుని, షాపులో ఉన్న బంగారు, నగదును తీసుకుని బైక్‌లపై పారిపోయారు. దీనిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు బోగరి రవిని పట్టుకుని ఆయన నుంచి రూ.1.5లక్షల నగదు, వెండి బార్లు, వెండి పాదపట్టీలు, మోటర్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అటెన్షన్ డైవర్షన్ పేరుతో జరిగిన ఈ చోరీలో బాధితుడు శ్రీనివాసులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టామని తెలిపారు. అందులో భాగంగా ఒరిస్సాకు చెందిన సోను, పాలపర్తి శివ, పాలపర్తి ప్రవీణ్‌ను పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టామని, వీలైనంత త్వరగా వారిని పట్టుకుంటామని పేర్కొన్నారు. కేసును త్వరగా ఛేదించిన సిబ్బందిని సీఐ అభినందించారు. కార్యక్రమంలో ఎస్‌ఐ నాగశేఖర్‌రెడ్డి, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
నిందితుల గుర్తింపు.. ఒకరి అరెస్ట్
మిగతావారి కోసం గాలింపు