
మద్యం మత్తులో బస్సు డ్రైవర్‌పై యువకుల దాడి
దోమలపెంట: ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు డ్రైవర్ కారు సరిగ్గా సైడ్ ఇవ్వలేదని హైదరాబాద్ నుంచి శ్రీశైలం వస్తున్న పికెట్ డిపోకు చెందిన సూపర్ లగ్జరి డ్రైవర్‌పై మద్యం మత్తులో ఉన్న కొందరు యువకులు దాడి చేసిన ఘటన సోమవారం మధ్యాహ్నం శ్రీశైలం ఆనకట్ట వద్ద చోటుచేసుకున్నట్లు ఈగలపెంట ఎస్‌ఐ జయన్న తెలిపారు. ఎస్‌ఐ కథనం ప్రకారం.. శ్రీశైలం నుంచి హైదరాబార్‌కు కారులో వెళ్తున్న యువకులు శ్రీశైలం ఆనకట్ట ఘాట్ రోడ్డు మలుపు వద్ద ఎదరుగా వస్తున్న ఆర్టీసీ బస్సు డ్రైవర్ సరిగ్గా దారి ఇవ్వలేదని బస్సును ఆపి డ్రైవర్ ప్రభాకర్‌ను బస్సులోంచి కిందకు లాగి పిడిగుద్దులతో దాడి చేశారు. ఘటనా స్థలంలో ఉన్న కొందరు డ్రైవర్‌ను యువకుల దాడి నుంచి కాపాడారు. దీంతో డ్రైవర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా.. యువకులు హైదరాబాద్‌కు చెందినవారిగా గుర్తించామని, త్వరలో అరెస్ట్ చేస్తామన్నారు. ఆనకట్ట ఘాట్‌రోడ్డు మలుపు వద్ద సైడ్ ఇవ్వాలంటే రోడ్డు సరిపోదని.. డ్రైవర్ వీలైనంత వరకు సైడ్ ఇచ్చినట్లు చెప్పారు. యువకులు మద్యం మత్తులో ఉండడంతో ఆవేశంతో దాడి చేసినట్లు చెప్పారు.
కారుకు సైడ్ ఇవ్వలేదని ఆగ్రహంతో
బస్సులోంచి లాగి పిడిగుద్దులు
బస్సు డ్రైవర్ ఫిర్యాదు మేరకు
కేసు నమోదు చేసిన పోలీసులు