
మిడ్జిల్‌లో పట్టపగలే చోరీ
మిడ్జిల్: మండల కేంద్రంలో మంగళవారం పట్టపగలే భారీ చోరీ జరిగింది. సంతబజారులో నివాసం ఉంటున్న లింగం, అతని భార్య ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. మంగళవారం ఉదయం ఇంటికి తాళం వేసి పాఠశాలకు వెళ్లారు. మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వచ్చారు. తాళం పగులగొట్టి ఉండటంతో ఇంట్లోకి వెళ్లి చూడగా, బీరువాలోని రూ.లక్ష నగదు, అర తులం బంగారు, 8 తులాల వెండి మాయమైనట్లు గుర్తించి పోలీసులను ఆశ్రయించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఎస్‌ఐ శివనాగేశ్వర్‌నాయుడు మహబూబ్‌నగర్ నుంచి వచ్చిన క్లూస్ టీం సాయంతో వేలిముద్రలు సేకరించారు. సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
ఫొటో స్టూడియోలో చోరీ
తిమ్మాజిపేట: మండల కేంద్రంలోని ఓ ఫోటో స్టూడియోలో సోమవారం అర్ధరాత్రి చోరీ జరిగినట్లు ఎస్‌ఐ హరిప్రసాద్‌రెడ్డి తెలిపారు. ఎస్‌ఐ కథనం మేరకు.. మండల కేంద్రానికి చెందిన జగన్‌కు తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లే దారిలో నిర్మల క్రియేషన్ పేరుతో ఫోటో స్టూడియో ఉంది. సోమవారం గుర్తు తెలియని వ్యక్తులు స్టూడియో పైన ఉన్న రేకులు తొలగించి స్టూడియోలోని కెమెరా, నగదు అపహరించినట్లు తెలిపారు. మంగళవారం గమనించిన షాపు యజమాని పోలీసులకు సమచారం ఇవ్వడంతో దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. నాగర్‌కర్నూల్ నుంచి వచ్చిన క్లూస్ టీంతో ఆధారాలను సేకరించినట్లు పేర్కొన్నారు. చోరీకి గురైన కెమెరా విలువ రూ. 3.60 లక్షలు, కొంత నగదు అపహరించినట్లు పేర్కొన్నారు.
ముగ్గురి రిమాండ్
డ్రంకెన్ డ్రైవ్ కేసులో మండలంలోని మరికల్‌కు చెందిన నరేందర్, నేరళ్లపల్లికి చెందిన పర్వతాలు, ఖిల్లాఘనపూర్ మండలం అప్పారెడ్డిపల్లికి చెందిన శేఖర్‌ను మంగళవారం రిమాండ్‌కు తరలించినట్లు ఎస్‌ఐ తెలిపారు.

మిడ్జిల్‌లో పట్టపగలే చోరీ

మిడ్జిల్‌లో పట్టపగలే చోరీ