
రెండు బైకులు ఢీ.. యువకుడు మృతి
ఉండవెల్లి: ఎదురెదురుగా బైకులు ఢీకొన్న ప్రమాదంలో చికిత్స పొందుతూ వ్యక్తి మృతి చెందిన ఘటన మండలంలోని డి.బూడిదపాడు శివారులో చోటు చేసుకుంది. పూర్తి వివరాలు.. అలంపూర్ మండలం లింగన్‌వాయి గ్రామానికి చెందిన ఇస్మాయిల్(27) ఫోటోగ్రాఫర్‌గా పని చేస్తున్నాడు. సోమవారం కర్నూల్ నుంచి బైరాపురం మీదుగా సొంత గ్రామానికి బైక్‌పై వెళ్తుండగా బూడిదపాడు శివారులో ఎదురుగా బైక్ రావడంతో రెండు బైక్‌లు ఢీకొన్నాయి. ప్రమాదంలో ఇస్మాయిల్ కిందపడి తీవ్రగాయాలు కావడంతో చికిత్స నిమిత్తం కర్నూలు ఆస్పత్రికి తరలించారు. ఇస్మాయిల్ చికిత్స పొందుతూ సోమవారం అర్ధరాత్రి మృతి చెందాడు. మంగళవారం మృతుడి తండ్రి పెద్దఖాజా ఫిర్యాదు మేరకు మరో బైక్‌పై ఉన్న ఇమాంపురం గ్రామానికి చెందిన విజయ్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ శేఖర్ పేర్కొన్నారు.
గుర్తు తెలియని శవం ఆచూకీ లభ్యం
కొత్తకోట రూరల్: పట్టణ శివారులోని జీటీ నారాయణ స్కూల్ సమీపంలో కాల్వలో పడి ఓ వ్యక్తి మృతిచెందిన విషయాన్ని సోమవారం స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. గుర్తు తెలియని మృతదేహంగా గుర్తించి పోలీసులు వనపర్తి ఆస్పత్రి మార్చురీకి తరలించారు. గుర్తు తెలియని మృతదేహం లభ్యం శిర్షీక సాక్షిలో ప్రచురితం కావడంతోపాటు వాట్సప్ గ్రూపుల్లో వైరల్ కావడంతో మృతుడికి సంబంధించిన వ్యక్తులు మంగళవారం కొత్తకోట పోలీసులను ఆశ్రయించి, వనపర్తి మార్చురీలో ఉన్న మృతదేహాన్ని పరిశీలించి తమదేనని నిర్ధారించారు. మృతుడు వనపర్తి మండలం నాగవరం గ్రామానికి చెందిన మండ్ల బక్కన్న(48)గా గుర్తించారు. నాగవరం నుంచి కొత్తకోటకు ఎందుకొచ్చాడు. కాల్వలో ఎలా పడ్డాడంటూ అనుమానం వ్యక్తం చేస్తూ మృతుడి కుమారుడు భీముడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.
చికిత్స పొందుతూ
వ్యక్తి మృతి
వనపర్తి రూరల్: శ్రీరంగాపురం మండలంలో పురుగుల మందు తాగిన వ్యక్తి చికిత్స పొందు తూ మృతి చెందిన ఘటన సోమవారం రాత్రి జరిగినట్లు ఎస్‌ఐ రామకృష్ణ తెలిపారు. ఎస్‌ఐ తెలిపిన వివరాలు. శ్రీరంగాపురం మండలం జానంపేట గ్రామానికి చెందిన పాటిమిని నాగన్న(58) కొన్నేళ్లుగా మద్యానికి బానిసయ్యాడు. తాగిన మైకంలో ఆదివారం మధ్యాహ్నం గడ్డిమందు తాగాడు. విషయం తెలుసుకున్న కు మారుడు నాగేష్ వనపర్తి ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందు తూ సోమవారం రాత్రి మృతి చెందినట్లు తె లిపారు. మంగళవారం మృతుడి కుమారుడు నగేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు.