
జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించాలి
మహబూబ్‌నగర్ క్రీడలు: వాలీబాల్ అకాడమీ క్రీడాకారులు భవిష్యత్‌లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాలని జిల్లా యువజన, క్రీడల అధికారి ఎస్.శ్రీనివాస్ అన్నారు. జిల్లాకేంద్రంలోని వాలీబాల్ అకాడమీకి రాష్ట్రస్థాయి సెలక్షన్స్‌లో ఎంపికై న బాల, బాలికలు మంగళవారం నుంచి అకాడమీలో రిపోర్టు చేశారు. ఈ సందర్భంగా అకాడమీకి వచ్చిన పలువురు బాల, బాలికలతో డీవైఎస్‌ఓ మాట్లాడారు. అకాడమీ క్రీడాకారులు క్రమశిక్షణతో ఉండాలని, కోచ్‌లు చెప్పే సలహాలు, సూచనలు పాటించాలన్నారు. వాలీబాల్ అకాడమీలో మీకు అవకాశం వచ్చిందని, దీనిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రాష్ట్రస్థాయి వరకు కాకుండా జాతీయస్థాయిలో ప్రతిభచాటాలని ఆకాంక్షించారు. వాలీబాల్‌లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో రాణించే క్రీడాకారులకు స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగావకాశాలు లభిస్తాయన్నారు. ముఖ్యంగా సీనియర్ నేషనల్ పోటీల్లో పతకం సాధించడమే లక్ష్యంగా ప్రాక్టిస్ చేయాలని కోరారు. గతంలో ఇక్కడ అకాడమీ ఉన్న సమయంలో జిల్లాకు చెందిన సందీప్, యశ్వంత్ అనే క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం సాధించారన్నారు. అలాగే పలువురు క్రీడాకారులు స్పోర్ట్స్ కోటాలో వివిధ శాఖల్లో ఉద్యోగాలు పొందినట్లు తెలిపారు. ఇలాంటి వారిని స్ఫూర్తిగా తీసుకొని వాలీబాల్‌లో నైపుణ్యం సాధించాలని ఆకాంక్షించారు. సాధ్యమైనంత వరకు సెల్‌ఫోన్‌కు దూరంగా ఉండాలని, శిక్షణలో అలసత్వం ప్రదర్శించవద్దని, ఉదయం, సాయంత్రం వేళల్లో నిరంతరం ప్రాక్టిస్ చేయాలని సూచించారు. కార్యక్రమంలో కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ రవీందర్‌రెడ్డి, వాలీబాల్, అథ్లెటిక్స్ కోచ్‌లు పర్వేజ్‌పాష, సునీల్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.