ఉమ్మడి పాలమూరు పెద్దన్నగా పిలుచుకునే ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు లక్షలాది ఎకరాలకు సాగునీరు అందించడమే కాకుండా.. విద్యుదుత్పత్తిలోనూ కీలకపాత్ర పోషిస్తుంది. ఇక్కడి ఎగువ, దిగువ జల విద్యుత్ కేంద్రాల్లోని 11 యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి చేస్తూ.. వెలుగులు ప్రసరిస్తోంది. కేవలం వరద నీరు ఆధారంగానే చేపట్టినా లక్ష్యానికి మించి ఉత్పత్తి చేస్తూ ప్రతి ఏటా రికార్డులు సృష్టిస్తోంది. గడిచిన పదేళ్లలో ఇప్పటి వరకు 5,400 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి చేపట్టగా.. 2022– 23లో ప్రాజెక్టు చరిత్రలోనే 640 మి.యూ., లక్ష్యానికి మించి 876 మి.యూ., విద్యుదుద్పత్తి చేపట్టి రికార్డు సృష్టించారు.
– ఆత్మకూర్