రైతుల కోసమే మా పోరాటం

మాట్లాడుతున్న టీపీసీసీ కార్యదర్శి అనిరుధ్‌రెడ్డి    - Sakshi

రాజాపూర్‌: ఎన్నికలకు ముందు ప్రజలకిచ్చిన హామీలను తుంగలో తొక్కి కుటుంబపాలన చేస్తున్న బీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని టీపీసీసీ కార్యదర్శి జనుంపల్లి అనిరుధ్‌రెడ్డి అన్నారు. సోమవారం రాజాపూర్‌ కాంగ్రెస్‌ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ వచ్చే సోమవారం నుంచి హాథ్‌ సే హాథ్‌ జోడో యాత్రను తన సొంత గ్రామమైన రంగారెడ్డిగూడ నుంచి మొదలుపెట్టి గడపగడపకు వెళ్లి వారి సమస్యలను తెలుసుకుంటానని తెలిపారు. రైతుల నుంచి తీసుకున్న దరఖాస్తులను ముఖ్యమంత్రి కేసీఆర్‌కు, కలెక్టర్‌కు, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి అందజేస్తామన్నారు. బీఆర్‌ఎస్‌ చేస్తున్న అక్రమాలను ప్రజల కు వివరిస్తామని, రుణమాఫీ కాని రైతుల వివరాలు తీసుకుంటామని చెప్పారు. పోలేపల్లిసెజ్‌లో పరిశ్రమలు వదులుతున్న కాలుష్యం విషయంపై ఎన్నోసార్లు పత్రికల్లో వరుస కథనాలు వచ్చినా.. స్థానిక ఎమ్మెల్యేకు, సంబంధిత అధికారులకు పట్టదని వి మర్శించారు. కాలుష్యం కారణంగా రైతులకు తమ పొలాల్లో పండక ఇబ్బందులు పడుతున్నా ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. కాలుష్యం అవుతుందంటే పోలీసులే బెదిరిస్తున్నారని, వారు అధికార పార్టీకి కొమ్ముకాస్తున్నారని ఆరోపించారు. బీఆర్‌ఎస్‌, బీజేపీ ఒకటేనని ప్రజలను మభ్యపెట్టేందుకే రెండు పార్టీలు నాటకాలు ఆడుతున్నాయ న్నారు. సమావేశంలో నాయకులు యాదయ్య, కృష్ణయ్యగౌడ్‌, శ్రీను, రమేష్‌రెడ్డి పాల్గొన్నారు.

టీపీసీసీ కార్యదర్శి జనంపల్లి అనిరుధ్‌రెడ్డి

Read latest Mahabubnagar News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top