ఎంహెచ్‌పీఎస్‌ జిల్లా అధ్యక్షుడిగా వీరబాబు | - | Sakshi
Sakshi News home page

ఎంహెచ్‌పీఎస్‌ జిల్లా అధ్యక్షుడిగా వీరబాబు

Oct 4 2026 10:13 AM | Updated on Oct 4 2026 10:13 AM

బయ్యారం: మాదిగ హక్కుల పోరాట సమితి (ఎంహెచ్‌పీఎస్‌) జిల్లా అధ్యక్షుడిగా మండలంలోని బాలాజీపేటకు చెందిన బైగళ్ల వీరబా బును నియమిస్తూ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు ఎం.ఉపేందర్‌ మాదిగ శనివారం ఉత్తర్వులు అందజేశారు.

ఎస్సీ, ఎస్టీ అభివృద్ధి సంఘం జిల్లా అధ్యక్షుడిగా వెంకన్న

తొర్రూరు రూరల్‌: ఎస్సీ, ఎస్టీ వర్గాల అభివృద్ధి సంఘం జిల్లా అధ్యక్షుడిగా మండలంలోని వెలికట్ట గ్రామానికి చెందిన బందు వెంకన్నను నియమించినట్లు సంఘం రాష్ట్ర ఆర్గనైజింగ్‌ సెక్రటరీ గడిపే రాములు శనివారం తెలిపారు.

ఆర్థికసాయం

మహబూబాబాద్‌ రూరల్‌: మండలంలోని జంగిలిగొండ గ్రామానికి చెందిన బీఆర్‌ఎస్‌ కార్యకర్త పోతుగంటి రమణాచారి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు. గ్రామ పార్టీ తరఫున బాధిత కుటుంబానికి శనివారం రూ.29వేల ఆర్థికసాయం అందజేశారు. కార్యక్రమంలో నాయకులు పంజాల రామ్మూర్తి, నలమాస సుధాకర్‌, పూజల శ్రీనివాస్‌, పూజల సతీష్‌, కొమ్మరాజుల సంజీవ, పంజాల యాకసాయిలు పాల్గొన్నారు.

రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీలకు ఎంపిక

మహబూబాబాద్‌ అర్బన్‌: ఉమ్మడి వరంగల్‌ జిల్లా తైక్వాండో అండర్‌–17 పోటీల్లో మైనార్టీ గురుకుల విద్యార్థులు పాల్గొని రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారని పాఠశాల ప్రిన్సిపాల్‌ జి.శ్రీనివాస్‌రావు శనివారం తెలిపారు. విద్యార్థులు దాఖత్‌అలీ, కనిష్క్‌తేజ్‌, తనిష్క్‌తేజ్‌, గోల్డ్‌మెడల్స్‌, సైఫ్‌అలీ, మణితేజ సీల్వర్‌ మెడల్స్‌ సాధించారు. పీడీ మహమ్మద్‌ నసీరుద్దిన్‌, విద్యార్థులు పాల్గొన్నారు.

భూ సర్వే వాయిదా

కురవి: మండల కేంద్రంలో వివాదాస్పదంగా మారిన సర్వే నంబర్‌ 177 ప్రభుత్వ భూమి సర్వే శనివారం వాయిదా పడింది. ప్రభుత్వ భూమి అన్యాక్రాంతమైందని కురవికి చెందిన దైదభద్రయ్య, ఇరుగు వెంకన్న, కిన్నెర మల్లయ్యలు కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన సంగతి విధితమే. ఈమేరకు జిల్లా ల్యాండ్‌ సర్వే అధికారి ఆదేశాలతో శనివారం సర్వే నిర్వహించేందుకు వచ్చారు. అయితే ఫిర్యాదు దారుల్లో ఒకరికే నోటీసు ఇవ్వడం, 177 నంబర్‌ చుట్టు పక్కల రైతులకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా సర్వే చేయడం సరికాదని నోటీసు అందుకున్న ఫిర్యాదుదారుడు దైదభద్రయ్య సర్వేను వ్యతిరేకించడంతో వాయిదా పడింది.

విస్తృత తనిఖీలు

మహబూబాబాద్‌ రూరల్‌: పట్టణంలో డ్రగ్స్‌, గంజాయి, మత్తు పదార్థాలు విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని టౌన్‌ సీఐ ఎల్‌.రఘుపతిరెడ్డి హెచ్చరించారు. ఎస్పీ డాక్టర్‌ శబరీష్‌ ఆదేశాల మేరకు డీఎస్పీ నంబూరి తిరుపతిరావు పర్యవేక్షణలో టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో నార్కోటిక్‌ డాగ్‌ సహాయంతో పోలీసులు శనివారం విస్తృత తనిఖీలు నిర్వహించారు.

ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీని కలిసిన నాయకులు

మహబూబాబాద్‌ అర్బన్‌: కలెక్టరేట్‌లో జిల్లా ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ ఉపేంద్రను రాష్ట్ర అంబేడ్కర్‌ యువజన సంఘం రాష్ట్ర, సహాయ కార్యదర్శి తప్పెట్ల వీరన్న, జిల్లా అధ్యక్షుడు కామ సంజీవరావు శనివారం మర్యాదపూర్వకంగా కలిసి బొకేను అందజేసి సన్మానించారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి నీరుడు సామేల్‌, కోశాధికారి వెంకటేశ్వర్లు, పరుశురాములు, వెంకన్న పాల్గొన్నారు.

నేడు నీటి సరఫరా బంద్‌

మహబూబాబాద్‌: మిషన్‌ భగీరథ ప్రధాన పైపులైన్‌ మరమ్మతుల కారణంగా నేడు నీటి సరఫరా నిలిపివేస్తున్నట్లు మున్సిపల్‌ కమిషనర్‌ వినోద్‌కుమార్‌ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.

కల్వర్టు నిర్మించాలి

బయ్యారం: మండలంలోని కంబాలపల్లి–కొత్తూరు గ్రామాల మధ్య రహదారిపై కల్వర్టు ను నిర్మించాలని తుడుందెబ్బ జిల్లా అధ్యక్షుడు చీమల శివకుమార్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశాడు. శనివారం ఆయన మాట్లాడారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement