సేంద్రియ ఎరువులతో అధిక దిగుబడులు | - | Sakshi
Sakshi News home page

సేంద్రియ ఎరువులతో అధిక దిగుబడులు

Oct 4 2026 10:13 AM | Updated on Oct 4 2026 10:13 AM

గార్ల: పంటల్లో సేంద్రియ, జీవ ఎరువులు వాడటం వల్ల తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు సాధించవచ్చని మండల వ్యవసాయ అధికారి కావటి రామారావు సూచించారు. శనివారం మండలంలోని సేరిపురం గ్రామంలో ఆత్మ ఆధ్వర్యంలో జీవన ఎరువులతో సాగు చేసిన పత్తిపంటలో ఆయన క్షేత్ర ప్రదర్శన చేసి రైతులకు అవగాహన కల్పించారు. రైతులు పంటల్లో రసాయనిక ఎరువుల వాడకం తగ్గించి నేలను, పర్యావరణం సంరక్షించాలని సూచించారు. సేంద్రియ, జీవన ఎరువుల వాడకం ద్వారా నేల భౌతికస్థితి మెరుగు పడుతుందన్నారు. రసాయనిక ఎరువులు మోతాదుకు మించి వాడితే భూమి చౌడుబారి పంటలకు ప్రతికూలంగా మారుతుందన్నారు. కార్యక్రమంలో ఏఈఓ రాజ్యలక్ష్మి, రైతులు పాల్గొన్నారు.

కొత్తగూడ: రైతులు జీవ సేంద్రియ పద్ధతులు అవలంభించి, అధిక దిగుబడులు సాధించాలని మండల వ్యవసాయాధికారి జక్కుల ఉదయ్‌ సూచించారు. మండలంలోని పలు గ్రామాల్లో రైతులకు శనివారం అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఏఈఓ రాజు, రైతులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement