తొర్రూరు: మున్సిపల్ సర్వసభ్య సమావేశాల నిర్వహణలో చైర్మన్, కమిషనర్‌ల తీరు మార్చుకోవాలని బీఆర్‌ఎస్ కౌన్సిలర్లు తెలిపారు. తమకు సమాచారం లేకుండా తీర్మానాలు చేస్తున్నారని ఆరోపిస్తూ మున్సిపల్ సర్వసభ్య సమావేశాన్ని శనివారం బీఆర్‌ఎస్ కౌన్సిలర్లు బహిష్కరించారు. అనంతరం పట్టణంలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో కౌన్సిలర్లు మాట్లాడారు. తీరు మార్చుకోకుంటే ఉన్నతాధికారులకు నివేధిస్తామన్నారు. ఈ సమావేశంలో కౌన్సిలర్లు కర్నె నాగరాజు, భూసాని జయమ్మ, తూర్పాటి రవి, పేర్ల జంపన్న, మాడ్గుల భవానిలత, అల్లం శ్యామల, ధరావత్ పద్మ పాల్గొన్నారు.


