డోర్నకల్: ప్రస్తుతం తీవ్రవర్షాభావ పరిస్థితులు నెలకొన్నందున రైతులు యాసంగి సీజన్‌లో పప్పు ధాన్యాల పంటలను సాగు చేయాలని ఆత్మ చైర్మన్ నల్లు సుధాకర్‌రెడ్డి కోరారు. మండలంలోని చిలుకోడు రైతువేదికలో శనివారం రైతునేస్తం కార్యక్రమంలో భాగంగా వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు ప్రసంగాన్ని రైతులు ప్రత్యక్షంగా తిలకించారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి కె.అనిల్‌కుమార్, సర్పంచ్ రాయల వెంకటేశ్వర్‌రావు, సెరీ కల్చర్ అధికారి సురేష్, ఏఈఓలు పాల్గొన్నారు.
తక్కువ నీటితో సాగయ్యే పంటలను పండించాలి
బయ్యారం: ఎల్‌నినోను దృష్టిలో ఉంచుకొని తక్కువ నీటితో సాగయ్యే పంటలను రైతులు పండించేలా అవగాహన కల్పించాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వీడియో కాన్ఫరెన్స్‌లో కోరారు. బయ్యారంలోని రైతువేదికలో శనివారం నిర్వహించిన రైతునేస్తం కార్యక్రమంను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో ఏఓ రాజు, సొసైటీ చైర్మన్ మల్లయ్య, బాలాజీపేట సర్పంచ్ పార్వతి, సొసైటీ డైరెక్టర్ శ్రీనివాస్ పాల్గొన్నారు.


