మహబూబాబాద్: కలెక్టరేట్‌లోని జిల్లా సంక్షేమాధికారి కార్యాలయంలో శనివారం చిరువ్యాపారం చేసే పేద మహిళలకు గొడుగులు పంపిణీ చేసినట్లు ఇన్‌చార్జ్ డీడబ్ల్యూఓ శిరీష తెలిపారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జిల్లాలోని ఐదు ప్రాజెక్ట్‌లకు గాను 25 గొడుగులను కేటాయించగా ప్రాజెక్ట్ పరిధిలో వ్యాపారం చేసే పేద మహిళలకు పంపిణీ చేసినట్లు తెలిపారు. మహిళా సాధికారత, సంక్షేమ కార్యక్రమాల అమలులో భాగంగా అవసరమైన సాయాన్ని అందించేందుకు చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో సీనియర్ అసిస్టెంట్ రాజు, మహిళా సాధికారత కేంద్రం సిబ్బంది పాల్గొన్నారు.


