కేసముద్రం: రక్తదానంతో ప్రాణాపాయంలో ఉన్న ఎంతో మందికి పునర్జన్మ లభిస్తుందని బీజేపీ రాష్ట్ర క్రమశిక్షణ సంఘం చైర్మన్, మాజీ ఎమ్మెల్యే మార్తినేని ధర్మారావు అన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రజాజీవితం 25సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శనివారం మండల కేంద్రంలోని పీహెచ్‌సీ సెంటర్‌లో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మోదీ ప్రజాసేవకు గుర్తుగా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయమన్నారు. కాగా మొత్తం 40మంది దాతలు ముందుకు వచ్చి రక్తదానం చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, ఎంపీడీఓ క్రాంతి, వైద్యులు శ్రీకాంత్, స్పందన, సుభాషిని, శివరాం, నాయకులు రామచందర్‌రావు, విజయ్, రమేష్, నర్సింహరెడ్డి, శశివర్దన్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, దామోదర్ తదితరులు పాల్గొన్నారు.
బీజేపీ రాష్ట్ర క్రమశిక్షణ సంఘం
చైర్మన్ ధర్మారావు


