పెసర రైతుకు మిగిలింది కన్నీరే.. | - | Sakshi
Sakshi News home page

పెసర రైతుకు మిగిలింది కన్నీరే..

Oct 4 2026 10:01 AM | Updated on Oct 4 2026 10:01 AM

కేసముద్రం: పెసర పంట సాగు చేసిన రైతులకు చివరకు కష్టాలే మిగిలాయి. ఒకవైపు ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు లేక పెసర సాగు చేసిన రైతులు అతికష్టంగా కోతుల బెడద నుంచి పంటను కాపాడుకున్నారు. కొద్దిగొప్ప దిగుబడి వచ్చిన పంటను విక్రయించేందుకు మారె్‌క్ట్‌కు వెళ్తే అక్కడ ధర తగ్గిపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా గత ఏడాది కేవలం 4వేల ఎకరాల లోపే పెసర పంట సాగు చేయగా.. ఈ ఏడాది అంచనాలకు మించి జిల్లా వ్యాప్తంగా 21,799 ఎకరాల్లో రైతులు పెసర సాగు చేశారు. కాగా.. సరైన వర్షాలు లేకపోవడం, తెగుళ్లతో పెసర పంట దిగుబడి తగ్గగా, మరోవైపు కోతుల బెడద కారణంగా పంట తీవ్రంగా దెబ్బతిన్నట్లు రైతులు వాపోతున్నారు. మొత్తంగా ఎకరాకు కేవలం క్వింటా నుంచి 2 క్వింటాళ్ల లోపే దిగుబడే వచ్చినట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మార్కెట్‌లో తగ్గిన ధర

శ్రమించి పండించిన పెసర పంట దిగుబడి తగ్గిపోయింది. కనీసం మార్కెట్‌లో గిట్టుబాటు ధర వస్తుందని రైతులు ఆశ పడ్డారు. మార్కెట్‌లో అమ్మేందుకు తీసుకెళ్తే క్వింటాకు గరిష్టంగా రూ.6 వేల నుంచి రూ.7 వేల వరకు ధర పలుకుతుంది. ఎకరాకు వేలల్లో పెట్టుబడులు పెడితే, కనీసం పెట్టుబడి కూడా దక్కడం లేదంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా మార్కెట్‌లో ఒకటి లేదా రెండు కూట్లకు అధిక ధరలు వేసి, మిగిలిన పెసర కూట్లకు ధరను అమాంతం తగ్గించి, తమను మోసగిస్తున్నారంటూ పలువురు రైతులు ఆరోపిస్తున్నారు. కనీసం ప్రభుత్వం కొనుగోళ్లు చేపడితే మద్దతు ధర రూ.8,780 దక్కుతుందని రైతులు కోరుతున్నారు.

సంవత్సరం క్వింటాళ్లు గరిష్ట ధర కనిష్ట ధర

2024–25 544 8,860 4,050

2025–26 3,794 7,129 4,000

2026–27 1,045 8,011 5,023

పంటకు కోతుల బెడద

మార్కెట్‌లో తగ్గిన ధర

ఆవేదనలో అన్నదాతలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement